శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 278 / Sri Lalitha Chaitanya Vijnanam - 278


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 278 / Sri Lalitha Chaitanya Vijnanam - 278 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🌻 278. 'పద్మాసనా' 🌻

పద్మము ఆసనముగా గలది శ్రీదేవి అని అర్థము.

పద్మము సృష్టి చిహ్నము. సృష్టివలె పొరలు పొరలుగా విచ్చుకొనునది. పద్మదళములు ప్రకృతి మయములు. పద్మనాళము జ్ఞానమయ నాళము. ఈ నాళము బురద యగు భౌతిక సృష్టి నుండి పరతత్త్వమందుకొనుడు సత్యలోక స్థితి వఱకు వ్యాపించి యుండును. పద్మనాళము బ్రహ్మరంధ్రము వంటిది. దళముల అరలు, పొరలు వివిధలోకములై విప్పారును. దళముల యందలి కాంతి శుద్ధ చైతన్యము. పద్మముగా వ్యాప్తి చెందునది పరతత్త్వము.

దళము లన్నియూ నాళముతో సంబంధము కలిగియుండుట సృష్టి యందలి ఏకత్వమును, ఐక్యతను, యోగస్థితిని సూచించును. ఈ సృష్టియను పద్మమును అధిష్ఠించి యుండు చైతన్య స్వరూపిణి శ్రీమాత గనుక ఆమెయే పద్మాసనా. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అగుటచే అతడు కూడ పద్మమున ఆసీనుడైనట్లు పురాణములు తెలుపుచున్నవి. అతడు ప్రత్యక్ష సృష్టికర్త.

శ్రీమాత పరోక్ష సృష్టికర్త. మానవుల యందు కూడా వివిధ లోకము లున్నవి. ఎన్ని లోకములు గలవో అన్ని పద్మములు కూడ ఏర్పడగలవు. పూర్ణ పురుషుల యందు పద్మము లన్నియూ వికసించి యుండును. వారు వికసించిన ముఖపద్మము కలిగి యుందురు. ఇతరులకు పద్మములు వికసింపక చక్రముల వలె యుండును. అన్ని లోకములయందు అన్ని పద్మముల యందు ఆసీనురాలై యుండునది శ్రీమాతయే.

ఆమె అనుగ్రహముననే చక్రములు పద్మములుగ విచ్చుకొనును. సహస్రార దళ పద్మమున పరమ శివునితో కూడియున్న శ్రీమాత జీవుల కొఱకు జీవ సృష్టిని గావించి తానే సహస్రారము నుండి ఆజ్ఞకు, అచ్చట నుండి విశుద్ధి కేంద్రమునకు, అటు తరువాత వెన్నెముక ద్వారా మూలాధారమునకు చేరును. శ్రీమాత మూలాధారమును చేరుటయే భౌతిక సృష్టికి ఆధారము.

ఆమె 'మూలాధారైక నిలయ'. జీవుని యొక్క పరిణామమును బట్టి మూలాధారము నుండి మరల తిరుగు ప్రయాణము ఊర్ధ్వగతిగ చేయును. కుండలిని వలె చుట్టలు చుట్టుకొనిన శ్రీమాత ఊర్ధ్వగతి చెందుటకు సంకల్పించినపుడు జీవుడు సాధన మార్గమును బట్టును. అతని సాధన యందలి శ్రద్ధా భక్తులను బట్టి శ్రీమాత ఊర్ధ్వముగ వ్యాప్తి చెందుచు షట్ పద్మముల నధిష్ఠించును. జీవుడు పరిపూర్ణుడై నపుడు సహస్రారమును చేరి శివునితో యోగించును.

ఆమె ననుసరించుచు జీవుడు కూడ పరమును చేరును. ఇట్లు పద్మము నందాసీన మైన సర్వమును నిర్వహించు చున్నది. శ్రీమాత. పద్మాసన యగు శ్రీమాతను ఆరాధించినచో దుఃఖములు తొలగును. భాగ్యమును పొందును. దేహము, గృహము స్వర్ణమయ మగును. స్త్రీ సహకారము పరిపూర్ణముగ నుండును. సుఖములతో కూడిన దైవయోగ ముండును. పద్మము ఆసనముగా గల శ్రీమాత సర్వ శుభంకరి అని ఎఱుగవలెను. పద్మము అతి విస్తారమైన సంకేతము. ఇతర నామములలో మరికొంత వివరింపబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 278 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀


🌻 Padmāsanā पद्मासना (278) 🌻

She is seated on a lotus or She is sitting in the posture of padmāsana (a yogic way of sitting, cross legged). Padma means lotus. When one is seated in padmāsana, the posture will appear like a lotus.

The leaves of lotus creeper are compared to prakṛti (the source of objectivity), its filaments to vikṛti (categories, changed condition), and its stalk to knowledge. Padma also means the Goddess of wealth Lakṣmī. In this context it indicates that She distributes wealth to Her devotees.

Here wealth does not mean material wealth only, but also the intellectual wealth, the capacity to have higher level of consciousness, needed to realise the Brahman. It could also mean the Brahma, the lord of Creation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jun 2021

No comments:

Post a Comment