🌹. వివేక చూడామణి - 124 / Viveka Chudamani - 124🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 26. ఆత్మ మార్పులేనిది - 11 🍀
410. జ్ఞాని తన హృదయములో సమాధి ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని, అది ఏ మాత్రము తిరుగులేని శాశ్వతత్వము, పూర్తి సత్యముతో, ఏ విధమైన వ్యతిరేకత లేకుండా ఉంది. శాంతమైన మహా సముద్రము దానికి పేరు లేదు. అందులో మంచిలేదు, చెడులేదు. అది శాశ్వతమైనది. శాంతిని పొందినది. ఏకమైనది.
411. ఎపుడైతే మనస్సు సమాధిలో విశ్రాంతిని పొందుతుందో అపుడు నీవు ఆత్మను నీలో దర్శించగలవు. అది శాశ్వతమై ఔన్నత్యమును పొంది, గత జన్మల వలన ఏర్పడిన బంధాలను వదిలించుకొని జాగ్రత్తగా మోక్ష స్థితిని పొందుతుంది. అనగా మోక్షానికి ముందు మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది.
412. ఆత్మను గూర్చి ధ్యానము చేయి. అది నీలోనే ఉన్నది. పరిమితమైన అన్ని విషయాలకు అది వేరుగా ఉన్నది. అదే ఉన్నతమై స్థిరమైన జ్ఞానము. అది ఒకటే రెండవది లేనిది. దానిని తెలుసుకొన్నప్పుడు నీవు పుట్టుక చావులకు అతీతముగా ముక్తిని పొందుతావు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 124 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 26. Self is Unchangeable - 11 🌻
410. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is undecaying and immortal, the positive Entity which precludes all negations, which resembles the placid ocean and is without a name, in which there are neither merits nor demerits, and which is eternal, pacified and One.
411. With the mind restrained in Samadhi, behold in thy self the Atman, of infinite glory, cut off thy bondage strengthened by the impressions of previous births, and carefully attain the consummation of thy birth as a human being.
412. Meditate on the Atman, which resides in thee, which is devoid of all limiting adjuncts, the Existence - Knowledge - Bliss Absolute, the One without a second, and thou shalt no more come under the round of births and deaths.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
02 Sep 2021
No comments:
Post a Comment