మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 76
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 76 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. శాశ్వతసత్యము ఎవరి ధ్యానమును బట్టి వారికి గోచరించును. 🌻
ఉన్నదే సత్యముగాని గోచరించునది సత్యము కాదు. భావము నిశ్చలమైనపుడు ఎవరి భావనను బట్టి వారికి సత్యము గోచరించును.
కర్తవ్యము మనస్సును పవిత్రము చేసి సంఘమునకు సుఖమును కలిగించును. సంఘము సుఖవంతము కావలెననియు దానికై తాను పాప విముక్తమైన మనస్సును పొందవలెననియు పాత్రత కలవాడు యోగించును.
తాను సుఖవంతుడు కావలెననియు, ప్రజలు పవిత్రులు కావలెననియు కోరునట్టి మనస్సు కలుషితమైనది.
అది మహాపదలను పుట్టించును. అట్టి సంఘమున నివసించువారికి మహాపదలు తప్పవు. ఈ స్థితి నుండి నిరంతరము రక్షింపబడుటకే యోగాభ్యాసము.
యజ్ఞార్థ కర్మ, యజ్ఞార్థ బుద్ధి యొక్క సద్వినియోగమునందు దృష్టి చెదురుట కలిధర్మములలో మొదటిది.
✍️. మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
02 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment