శ్రీ శివ మహా పురాణము - 884 / Sri Siva Maha Purana - 884


🌹 . శ్రీ శివ మహా పురాణము - 884 / Sri Siva Maha Purana - 884 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴

🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 4 🌻


మరల శివశంఖచూడుల మధ్య పెద్ద యుద్ధము చెలరేగెను. పర్వతములు, సరస్సులు మరియు సముద్రములతో కూడియున్న భూమి మరియు స్వర్గము కూడ కంపించెను (29). ఆ యుద్ధములో శంఖచూడుడు ప్రయోగించిన బాణములను శివుడు, శివుడు ప్రయోగించిన వేలాది బాణములను శంఖచూడుడు అనేక పర్యాయములు తమ తమ వాడి బాణములతో ఛేదించిరి (30). అపుడు శంభుడు కోపించి త్రిశూలముతో వానిని కొట్టగా, ఆ దెబ్బకు తాళజాలక ఆతడు మూర్ఛిల్లి నేలపై బడెను (31). అపుడా రాక్షసుడు క్షణములో తెలివి దెచ్చుకొని ధనస్సును ఎక్కుపెట్టి రుద్రుని, ఆయన అనుచరులనందరినీ బాణములతో కొట్టెను (32).

ప్రతాపవంతుడగు శంఖచూడుడు పదివేల బాహువులను పొంది ఒక్కసారిగా పదివేల చక్రములతో శంకరుని కప్పివేసెను (33). అపుడు దుర్గకు భర్త, దుర్గమములగు కష్టములనుండి గట్టెక్కించువాడు నగు రుద్రుడు కోపించి వెంటనే ఉత్తమములగు తన బాణములతో ఆ చక్రములను ఛేదించెను (34). అపుడా దానవుడు పెద్ద సేనతో గూడి గదను చేతబట్టి వెంటనే శివుని కొట్టుటకై వేగముగా ముందునకురికెను (35). దుష్టుల మదమునడంచు ఆ శివుడు మిక్కిలి కోపించి వేగముగా మీద పడబోవుచున్న ఆ శంఖచూడుని గదను పదునైన కత్తితో ముక్కలుగా చేసెను (36).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 884 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴

🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 4 🌻


29. Again the great battle between Śiva and the Dānava was resumed. The heaven and the earth including all mountains, oceans and rivers shook and trembled.

30. Śiva split up the arrows discharged by the son of Dambha by means of hundred and thousands of his fierce arrows. Similarly the arrows of Śiva were split up by the Dānava.

31. Then the infuriated Śiva hit him with his trident. Unable to bear that blow he fell unconscious on the ground.

32. The Asura regained consciousness rapidly. He seized his bow and hit Rudra and all others by means of his arrows.

33. The valorous Saṅkhacūḍa assumed ten thousand arms by means of magic and rapidly enveloped Śiva by means of ten thousand discuses.

34. Then Śiva, the infuriated consort of Durgā, the destroyer of all insurmountable distress split the discuses rapidly by means of his excellent arrows.

35. Then the Dānava seized his mace and accompanied by a huge army rushed at Śiva with the intention to kill him.

36. The infuriated Śiva, the destroyer of the pride of the wicked split the mace of the Dānava rushing headlong by means of a sharp-edged sword.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment