26-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26, ఆక్టోబర్ 2021 శుక్ర వారం, భృగువారము, కార్తీక మాసం 22వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 119 / Bhagavad-Gita - 119 2-72🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 516 / Vishnu Sahasranama Contemplation - 516 🌹
4) 🌹 DAILY WISDOM - 194🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 33🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 100 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*26, నవంబర్‌ 2021, భృగువారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 22వ రోజు 🍀*

*నిషిద్ధములు : పంటికి పని చెప్పే పదార్ధాలు*
*దానములు : బంగారం, గోధుమలు, పట్టుబట్టలు*
*పూజించాల్సిన దైవము : సూర్యుడు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం సూం – సౌరయే స్వాహా, ఓం భాం – భాస్కరాయ స్వాహా*
*ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ సప్తమి 29:44:49 వరకు 
తదుపరి కృష్ణ అష్టమి 
నక్షత్రం: ఆశ్లేష 20:37:01 వరకు 
తదుపరి మఘ
యోగం: బ్రహ్మ 08:02:06 వరకు 
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 17:13:25 వరకు
వర్జ్యం: 08:35:32 - 10:18:36
దుర్ముహూర్తం: 08:41:28 - 09:26:18 
మరియు 12:25:40 - 13:10:30
రాహు కాలం: 10:39:10 - 12:03:14
గుళిక కాలం: 07:51:01 - 09:15:05
యమ గండం: 14:51:23 - 16:15:28
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 18:53:56 - 20:37:00
సూర్యోదయం: 06:26:57
సూర్యాస్తమయం: 17:39:32
వైదిక సూర్యోదయం: 06:30:46
వైదిక సూర్యాస్తమయం: 17:35:42
చంద్రోదయం: 23:28:52
చంద్రాస్తమయం: 11:55:00
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మృత్యు యోగం - మృత్యు భయం 
20:37:00 వరకు తదుపరి కాల యోగం
 - అవమానం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 119 / Bhagavad-Gita - 119 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 72 🌴*

72. ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామన్తకాలే(పి బ్రహ్మనిర్వాణ మృచ్చతి ||

🌷. తాత్పర్యం :
*ఇదియే అధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణ సమయము నందును ఆ విధముగా స్థితుడైనవట్టి వాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనము (ఆధ్యాత్మిక జీవనము) మనుజడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేక పోవచ్చును. ఇది కేవలము తత్త్వము యొక్క అవగాహన మరియు అంగీకకారముపైననే ఆధారపడి యున్నది. కృష్ణునకు శరణము నొందుట ద్వారా ఖట్వాంగమహారాజు మరణమునకు కొలది నిమిషమునకు ముందే అట్టి జీవనస్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయపూర్ణ జీవనమునకు ముగించుటయే నిర్వాణము. 

భౌతికజీవనము తరువాత మిగులునది శూన్యమని భౌద్ధవాదము తెలుపుచుండగా అందులకు భిన్నముగా శ్రీమద్భగవద్గీత ఉపదేశించుచున్నది. అనగా నిజమైన జీవితము భౌతికజీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది. ఈ భౌతికజీవన విధానము ప్రతి యొక్కరు అంతము చేసికొనియే తీరవలెనని తెలిసికొనుట లౌకికునికి సరిపోవును. కాని ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు భౌతికజన్మము తదుపరి వేరొక ఆధ్యాత్మికముగా కలదని ఎరుగవలెను. జన్మ ముగియుటకు పూర్వమే మనుజుడు అదృష్టవశమున కృష్ణభక్తిరసభావితుడు అయినచో శీఘ్రమే “బ్రహ్మనిర్వాణస్థితి”ని పొందగలడు. 

భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు భేదము లేదు. ఆ రెండును ఒకే పూర్ణత్వస్థాయిలో ఉన్నట్టివి కనుక భగవానుని సేవయందు నిలుచుట యన్నది భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతికజగమునందు ఇంద్రియప్రీతి కర్మలుండగా అధ్యాత్మికజగమున కృష్ణపరకర్మలుండును. ఈ జన్మమునందే కృష్ణభక్తిని పొందుట యనునది శీఘ్రమే బ్రహ్మస్థితిని కలుగజేయును. కనుకనే కృష్ణభక్తిరసభావితుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టివాడే యగుచున్నాడు.

బ్రహ్మము భౌతికత్వమునకు వ్యతిరేకమైనది. కనుక “బ్రహ్మీస్థితి” యనగా భౌతిక కర్మకలాపములను కూడిన స్థాయిలో నిలువకుండుట యని అర్థము. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు భక్తియుక్తసేవ ముక్తస్థితిగా భగవద్గీత యందు అంగీకరింపబడినది (సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే). కనుకనే బ్రాహ్మీస్థితి భౌతికబంధముల నుండి ముక్తిని పొందినట్టి స్థితియై యున్నది.

భగవద్గీత యొక్క ఈ ద్వితీయాధ్యాయము గీతాసారమని శ్రీల భక్తివినోదఠాకూరులు తెలిపియుండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగములనునవి భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయధ్యాయమున గీతాసారాంశముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా చర్చించబడి భక్తియోగము కొద్దిగా సూచించబడినది.

శ్రీమద్భగవద్గీత యందలి “గీతాసారము” అను ద్వితీయాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 119 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 72 🌴*

72. eṣā brāhmī sthitiḥ pārtha naināṁ prāpya vimuhyati
sthitvāsyām anta-kāle ’pi brahma-nirvāṇam ṛcchati

🌷Translation :
*That is the way of the spiritual and godly life, after attaining which a man is not bewildered. If one is thus situated even at the hour of death, one can enter into the kingdom of God.*

🌷 Purport :
One can attain Kṛṣṇa consciousness or divine life at once, within a second – or one may not attain such a state of life even after millions of births. It is only a matter of understanding and accepting the fact. Khaṭvāṅga Mahārāja attained this state of life just a few minutes before his death, by surrendering unto Kṛṣṇa. Nirvāṇa means ending the process of materialistic life. According to Buddhist philosophy, there is only void after the completion of this material life, but Bhagavad-gītā teaches differently. 

Actual life begins after the completion of this material life. For the gross materialist it is sufficient to know that one has to end this materialistic way of life, but for persons who are spiritually advanced, there is another life after this materialistic life. Before ending this life, if one fortunately becomes Kṛṣṇa conscious, he at once attains the stage of brahma-nirvāṇa. There is no difference between the kingdom of God and the devotional service of the Lord.

Thus end the Bhaktivedanta Purports to the Second Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of its Contents.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 516 / Vishnu Sahasranama Contemplation - 516 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 516. అమిత విక్రమః, अमित विक्रमः, Amita vikramaḥ 🌻*

*ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ*

*అపరిచ్ఛిన్నోమితో యత్ విక్రమాఽశ్చక్రిణ స్త్రయః ।*
*అమితో విక్రమశ్శౌర్యం వాస్యేత్యమిత విక్రమః ॥*

*ఈతనికి ఇంతయని పరిమితి నిర్ణయించనలవికాని పెద్ద పాజ్ఞాసములు మూడు త్రివిక్రమావతారమున (వామనావతారము) కలవు. లేదా ఈతనికి అమితమైన శౌర్యము గలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 516 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 516. Amita vikramaḥ 🌻*

*OM Amitavikramāya namaḥ*

अपरिच्छिन्नोमितो यत् विक्रमाऽश्चक्रिण स्त्रयः ।
अमितो विक्रमश्शौर्यं वास्येत्यमित विक्रमः ॥

*Aparicchinnomito yat vikramā’ścakriṇa strayaḥ,*
*Amito vikramaśśauryaṃ vāsyetyamita vikramaḥ.*

*Whose vikramās i.e., three steps were amitaḥ or unlimited in the Trivikrama or Vāmana incarnation. Or Whose Vikrama or valor is amitam i.e., enormous.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 194 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 12. How Could There be Sorrow for the Spirit? 🌻*

*There is such a thing called the sorrow of the spirit, though it may look like an anomaly. How could there be sorrow for the spirit? Yes, there is some kind of situation in which our deeper self finds itself in its search for the Absolute. These are all interesting stages that are in mystical theology and the yoga of the advent of the spirit.*

*Some of the songs and poems of the Vaishnava saints of the south, the Alvars, particularly the Nawars, and some of the rapturous expressions of the leading Shaivite saints, will be enough examples to us of the inexpressible and intricate spiritual processes through which the seeker has to pass. We are accustomed merely to a little japa, a little study of the Gita that we chant and repeat by rote every day like a machine, and we feel that our work is over, that we have done our sadhana.*

*The deeper spirit has to be touched, and it has to be dug out like an imbedded illness. When it is pulled out there is a reaction, and the reaction is a spiritual experience by itself, through which Arjuna had to pass. A little of it is given to us in the first chapter and the earlier portions of the second chapter of the Bhagavadgita.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 33 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ *

*🌻 22. క్రమము - క్రతువు 🌻*

*దైనందిన జీవనము ఒక క్రతువు వలె క్రమబద్ధము కావలెను. క్రమమే క్రతువునకు బలము. క్రమమే జీవనమునకు కూడ బలము. శ్రమ జీవనము క్రమ జీవనగముగ ఉత్తీర్ణత చెందవలెను. క్రమమబ్బిన వారికి పరమబ్బుట సాధ్యము కదా! దైనందిన కార్యక్రమములకు ఒక క్రమమేర్పరచుటకు ప్రయత్నించుము. అట్టి ప్రయత్నము విసుగు వచ్చుట సహజము. ఓర్పుతో విసుగును జయించ వలెను.*

శ్రద్ధ, ఓర్పు విసుగునకు విరుగుడు. అటులనే విసుగు శ్రద్ధా ఓర్పులకు మరణము. జీవితమున క్రమమేర్పరచినపుడు నీ యందు ఘర్షణ కూడ కలుగ గలదు. ఘర్షణము స్వభావమును మధనము చేయు శక్తి. మథనము నందు కూడ క్రమమును విడువకుము. క్రమవంతుడు చైతన్యమున పెరుగును. అనగా వికాసము చెందుట, వ్యాపించుట అతడికి జరుగ గలవు. క్రమము చేత పరమును కూడ ఆక్రమించ వచ్చును. అతడే నిజమైన పరాక్రమవంతుడు. అనగా క్రమమాధారముగ పరమును కూడ ఆక్రమించిన వాడని అర్థము. అగస్త్యాదులు అట్టివారు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 100 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు. అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. 🍀*

*దేవుడికి చీకటి లేదు. కాంతికి చీకటి లేదు. కాంతి లేనపుడు మాత్రమే చీకటి వుంటుంది. అందువల్ల ఆ రెండూ కలవవు. కాంతికి చీకటి వుందనే విషయమే తెలీదు. కాంతికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే కాంతి వుంటే చీకటి వుండదు. అది లేనపుడే చీకటి వుంటుంది. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు.*

*అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. ఆ రోజు చీకటి మన నించీ మాయమయిన రోజు. ఆ రోజు మనకు గొప్ప ఉత్సవం కలిగే రోజు. మనకు గొప్ప ఆశీర్వాదం దొరికే రోజు. ఆ రోజు ఏదంటే నువ్వు కాంతి అని తెలుసుకున్న రోజు.*

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 323-1. 'కదంబ కుసుమప్రియా'🌻* 

*కదంబ పుష్పముల యందు ప్రీతి కలది శ్రీమాత అని అర్థము. కదంబ మనగా సిందూర వర్ణము అని ఒక అర్థము కలదు. కదంబ పుష్పములు గోళాకారము, సిందూర వర్ణము కలిగి యుండును. సిందూర వర్ణము యందు పసుపు సిందూరము, ఎఱుపు సిందూరము కూడ గలవు. ఈ వర్ణము భావలోక పవిత్రతకు చిహ్నము. భావ లోకమునందు పరిపూర్ణమగు పవిత్రత శ్రీదేవి సాన్నిధ్యము. ఈ వర్ణ తరంగములను ధ్యానించిన భావమాలిన్యములు నిర్మూలింపబడును.*

*అపుడు బుద్ధి లోకము అందుబాటులో నుండును. పవిత్రమగు కదంబ పుష్పముల వంటి మనస్సు గల వారందరూ శ్రీమాత ప్రీతిపాత్రులే. పవిత్రమగు మనస్సులే కదంబ కుసుమములు. వాని యందే శ్రీమాతకు ప్రీతి. శ్రీమాతను పూజించుటకు కూడ ఈ వర్ణము పూవులను మిక్కుటముగ వాడుట సంప్రదాయము. అట్టి వర్ణ పుష్పములు పవిత్రములు గనుక వానితో చేయు పూజ వలన శ్రీమాత ప్రీతి చెందగలదు.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 323-1. Kadamba-kusuma-priyā कदम्ब-कुसुम-प्रिया (323)🌻*

*She is fond of kadamba flowers, amidst the tress of which She lives (nāma 60). The same nāma appears in Lalitā Triśatī as nāma 11. Lalitā Triśatī consists of 300 nāma-s. This 300 is arrived at by multiplying fifteen bīja-s of Pañcadaśī by twenty. The first bīja in Pañcadaśī is ‘ka’ (क). The first twenty nāma-s begin with this bīja and the next twenty nāma-s begin with next alphabet of Pañcadaśī ‘e’ (ए). Triśatī is considered very powerful as it originates from the Pañcadaśī mantra.*

*There are said to be five types of sacred trees and kadamba tree is one among them. These five sacred trees said to represent the four components of antaḥkaraṇa viz. mind, intellect, consciousness and ego and the fifth being the heart where the soul is said to reside (Some modern interpretations point out that the soul resides within the pineal gland, the gland of divinity). The smell of these flowers is compared to the modifications of the mind.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment