శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 323-1. 'కదంబ కుసుమప్రియా'🌻

కదంబ పుష్పముల యందు ప్రీతి కలది శ్రీమాత అని అర్థము. కదంబ మనగా సిందూర వర్ణము అని ఒక అర్థము కలదు. కదంబ పుష్పములు గోళాకారము, సిందూర వర్ణము కలిగి యుండును. సిందూర వర్ణము యందు పసుపు సిందూరము, ఎఱుపు సిందూరము కూడ గలవు. ఈ వర్ణము భావలోక పవిత్రతకు చిహ్నము. భావ లోకమునందు పరిపూర్ణమగు పవిత్రత శ్రీదేవి సాన్నిధ్యము. ఈ వర్ణ తరంగములను ధ్యానించిన భావమాలిన్యములు నిర్మూలింపబడును.

అపుడు బుద్ధి లోకము అందుబాటులో నుండును. పవిత్రమగు కదంబ పుష్పముల వంటి మనస్సు గల వారందరూ శ్రీమాత ప్రీతిపాత్రులే. పవిత్రమగు మనస్సులే కదంబ కుసుమములు. వాని యందే శ్రీమాతకు ప్రీతి. శ్రీమాతను పూజించుటకు కూడ ఈ వర్ణము పూవులను మిక్కుటముగ వాడుట సంప్రదాయము. అట్టి వర్ణ పుష్పములు పవిత్రములు గనుక వానితో చేయు పూజ వలన శ్రీమాత ప్రీతి చెందగలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 323-1. Kadamba-kusuma-priyā कदम्ब-कुसुम-प्रिया (323)🌻

She is fond of kadamba flowers, amidst the tress of which She lives (nāma 60). The same nāma appears in Lalitā Triśatī as nāma 11. Lalitā Triśatī consists of 300 nāma-s. This 300 is arrived at by multiplying fifteen bīja-s of Pañcadaśī by twenty. The first bīja in Pañcadaśī is ‘ka’ (क). The first twenty nāma-s begin with this bīja and the next twenty nāma-s begin with next alphabet of Pañcadaśī ‘e’ (ए). Triśatī is considered very powerful as it originates from the Pañcadaśī mantra.

There are said to be five types of sacred trees and kadamba tree is one among them. These five sacred trees said to represent the four components of antaḥkaraṇa viz. mind, intellect, consciousness and ego and the fifth being the heart where the soul is said to reside (Some modern interpretations point out that the soul resides within the pineal gland, the gland of divinity). The smell of these flowers is compared to the modifications of the mind.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2021

No comments:

Post a Comment