నిర్మల ధ్యానాలు - ఓషో - 100
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 100 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు. అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. 🍀
దేవుడికి చీకటి లేదు. కాంతికి చీకటి లేదు. కాంతి లేనపుడు మాత్రమే చీకటి వుంటుంది. అందువల్ల ఆ రెండూ కలవవు. కాంతికి చీకటి వుందనే విషయమే తెలీదు. కాంతికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే కాంతి వుంటే చీకటి వుండదు. అది లేనపుడే చీకటి వుంటుంది. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు.
అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. ఆ రోజు చీకటి మన నించీ మాయమయిన రోజు. ఆ రోజు మనకు గొప్ప ఉత్సవం కలిగే రోజు. మనకు గొప్ప ఆశీర్వాదం దొరికే రోజు. ఆ రోజు ఏదంటే నువ్వు కాంతి అని తెలుసుకున్న రోజు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment