మైత్రేయ మహర్షి బోధనలు - 33
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 33 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 22. క్రమము - క్రతువు 🌻
దైనందిన జీవనము ఒక క్రతువు వలె క్రమబద్ధము కావలెను. క్రమమే క్రతువునకు బలము. క్రమమే జీవనమునకు కూడ బలము. శ్రమ జీవనము క్రమ జీవనగముగ ఉత్తీర్ణత చెందవలెను. క్రమమబ్బిన వారికి పరమబ్బుట సాధ్యము కదా! దైనందిన కార్యక్రమములకు ఒక క్రమమేర్పరచుటకు ప్రయత్నించుము. అట్టి ప్రయత్నము విసుగు వచ్చుట సహజము. ఓర్పుతో విసుగును జయించ వలెను.
శ్రద్ధ, ఓర్పు విసుగునకు విరుగుడు. అటులనే విసుగు శ్రద్ధా ఓర్పులకు మరణము. జీవితమున క్రమమేర్పరచినపుడు నీ యందు ఘర్షణ కూడ కలుగ గలదు. ఘర్షణము స్వభావమును మధనము చేయు శక్తి. మథనము నందు కూడ క్రమమును విడువకుము. క్రమవంతుడు చైతన్యమున పెరుగును. అనగా వికాసము చెందుట, వ్యాపించుట అతడికి జరుగ గలవు. క్రమము చేత పరమును కూడ ఆక్రమించ వచ్చును. అతడే నిజమైన పరాక్రమవంతుడు. అనగా క్రమమాధారముగ పరమును కూడ ఆక్రమించిన వాడని అర్థము. అగస్త్యాదులు అట్టివారు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment