✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణు మాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక బలహీనతలు - భయము 🌻
సాధకుడు భగవదనుభూతిని పొందుటకై చేయు సాధనామార్గమున తన అథశ్చేతనలో దాగియున్న కొన్ని ప్రతికూల భావనల నుండి బయటపడవలెను.
ప్రతి జీవుడు సహజముగా దైవాంశగా ఉన్న ప్రేమ, త్యాగము, వినయము వంటి దివ్యగుణములతో కూడియున్నను, దేహధారి అగుటతో పరిణామమున కొన్ని అసుర లక్షణములు కూడ అతనిని కప్పియుండును.
సరియైన వివేచనతో, ఇంగితజ్ఞానముతో, సత్సాంగత్యముతో, కర్తవ్య నిష్ఠతో వీని నుండి బయటపడవచ్చును.
సాధకుడు మున్ముందుగా తన లోపములను సమర్థించుకొనుటకు, కప్పిపుచ్చుటకు ప్రయత్నింపక, వానిని సూటిగా అంగీకరించుటకు సంసిద్ధుడు కావలెను. తన లోపముల ఉనికిని అంగీకరించుటకు సిద్ధము కానివాడు వానిని సరిదిద్దుకొనుటకు ఎట్లు ఇష్టపడును?
సాధుపురుషులను ఆశ్రయించి, వారి యందు వినయముతో మెలగుచూ, వారిని అనుసరించుటతో తన లోపములను శుద్ధి చేసుకొనవచ్చును.
తన లోపములను గూర్చి క్రుంగిపోనక్కరలేదు. ఎంతటి దురాచారుడైనను తన పూర్వకర్మ ప్రధానము వలన ఏర్పడిన దుర్వాసనల నుండి బయటపడును.
దయామయుడైన దేవుడు అవకాశములను ఇచ్చుచున్నాడు. సర్వాంతర్యామికి శరణంది, సేవించనారంబించుటతో తనలో దాగియున్న దివ్యగుణములు వికసింపసాగును.....
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2021
No comments:
Post a Comment