🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జైమినిమహర్షి - 2 🌻
06. వ్యాసమహర్షి ఎప్పుడయితే కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు వుభాగాలు ఈ విషయంలో చేసారో; ఏది అనుసరణీయం, ఏది ప్రధానమైనది అనే ప్రశ్న సహజంగా పుట్టింది. అంతకుముందు అదీ ఉంది, ఇదీ ఉంది. వేద్దంతులున్నారు. విజ్ఞానవేత్తలున్నారు. బ్రహ్మలున్నారు. మోక్షకాములున్నారు. మోక్షంకొరకే జీవించేవాళ్ళున్నారు. కర్మకాండకూడా ఉన్నది.
07. ఆ విధంగా వేదంలో ఈ రెండువిభాగాలలో ఏది అత్యుత్కృష్టమైనది, ఏది అనుసరణీయము, సర్వులకూ విధిగావుండి, అందరికీ అనుసరణీయమయిన మతం ఒకటున్నాదా అని ప్రశ్న వచ్చినప్పుడు; దానికి సమాధానంగా జైమిని తన మతాన్ని ప్రతిష్ఠచేసాడు.
08. ఎన్నిరకాలుగా జైమిని గురించి మనం సమర్థించే ప్రయత్నంచేసినా, వ్యాసమతం జైమినిమతం కాదు. జైమినిమతం వ్యాససమ్మతం కాదు. ఇద్దరికీ వేదమే ప్రమాణం, ఇద్దరూ వేదపురుషులే! సందేహంలేదు. అయితే భేదంమాత్రం ఉంది. అక్కడే ఆర్య సంస్కృతి విచిత్రమైన మలుపు తిరిగింది.
జైమినిమహర్షి చరిత్ర పరమపవిత్రమైనది.
09. ఆయన కర్మకాండ ప్రతిపాదించినా, ఈశ్వరుడిని ప్రతిపాదించలేదు. అది ఏ మార్గంలో అన్నాడు అని ఆలోచంచాలి మనం. ఎందుకంటే, ఈశ్వరుడులేడని ఒకమాట అంటే అది అంత సులభమయిన విషయంకాదు. అది సద్విమర్శగా జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకోవలసిన విషయం.
10. స్థూలంగా మాత్రం ఆయన ఈశ్వర అస్తిత్వమును ఒప్పుకోలేదు. ‘ఈశ్వరుడన్నవాడులేడు. వేదములున్నవి. కర్మలున్నవి. అంతే నీకు ముఖ్యమైన విధి” అని ఆయన మతం. ఆయన జీవితచరిత్రను సంగ్రహంగా నాలుగు ముఖ్యవిషయాలతో తెలుసుకుని ఆయనకు నమస్కరించటమే మన కర్తవ్యం.
11. ఈ మహాత్ముల చరిత్రలన్నీకూడా, ఏ కుతంబంలో ఎవరు ఎక్కడ పుట్టిపెరిగారో అన్న విషయం అందరి విషయంలోనూ చెప్పబడిలేదు. అలాగే జైమినిమహర్షికూడా! ఆయన తల్లితండ్రులెవరో తెలియదు. జన్మవిశేషాలు తెలియవు. మరి ఒక్కటే ‘నేను వ్యాసమహర్షి శిష్యుణ్ణి’ అన్నాడు.
జైమినిమహర్షి తనవంతుగా సామవేదాన్ని అనేకమందికి చెప్పాడు.
12. జైమిని సుమంతుడనే కుమారుడికి సామమును ఇచ్చాడు. అతడి కుమారుడు సుకర్ముడనేవాడు, తండ్రి వద్ద సామవేదాన్ని తీసుకుని, వేయిశాఖలుగా దానిని విభాగంచేసాడు. ఇప్పుడన్ని శాఖలులేవు. రెండేశాఖలున్నాయి. కాశ్మీరదేసంలో సామవేదం పుట్టిందంటారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2021
No comments:
Post a Comment