✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 1 🌻
గురుబ్రహ్మ గురుర్విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః
612. భగవంతుని 10 వ స్థితిలో నున్నవారు సద్గురువులు, అవతారపురుషుడు.
613. భగవంతుని 10వ స్థితిలో సద్గురువు, భగవంతుని అనంతజ్ఞాన,శక్తి,ఆనందములను అనుభవించుటయే కాక, వాటిని భగవత్కార్కాలయము ద్వారా పరులకై వినియోగపరచును.
614. మానవునిగా ఉన్న భగవంతుడు, భగవంతుని స్థితిలో గమ్యస్థానమును చేరిన తరువాత చాలా అరుదుగా తన అనంతానందమును వీడి, సాధారణ చైతన్య స్థితికి క్రిందకి దిగివచ్చును.అనగా భగవంతుని జీవితములో స్థిరపడును ఇచ్చట మానవునిలో భగవంతుని జీవితము ప్రతిష్ఠింపబడినది. ఇదియే ఆత్మ ప్రతిష్టాపనము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2021
No comments:
Post a Comment