నిర్మల ధ్యానాలు - ఓషో - 144


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 144 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమస్య మనతో వుంది. వునికితో కాదు. అనాది నించి జరుగుతున్న ప్రయత్నమొకటే. మనుషుల్ని మనసు విప్పేలా చెయ్యడం. అప్పుడు వాళ్ళు నక్షత్రాల్తో, మేఘల్తో, సూర్యచంద్రుల్తో సంబంధం ఏర్పరచు కుంటారు. దైవత్వమదే. 🍀


దేవుడు అందరి పట్లా సమభావంతో వుంటాడు. ఉనికిలో పక్షపాతం లేదు. ఉనికిలో కేవలం నిష్పక్షపాతమే వుంది. అట్లా అంటే అది చలనం లేనిదని కాదు. అందులో వెచ్చదనముంది. ప్రేమ వుంది. పట్టించుకోవడముంది. రక్షించడముంది. మనం ఆ వెచ్చదనానికి మనసు విప్పం. ముడుచుకుని వుంటాం. సమస్య మనతో వుంది. వునికితో కాదు. అనాది నించి జరుగుతున్న ప్రయత్నమొకటే. మనుషుల్ని మనసు విప్పేలా చెయ్యడం.

అప్పుడు వాళ్ళు నక్షత్రాల్తో, మేఘల్తో, సూర్యచంద్రుల్తో సంబంధం ఏర్పరచుకుంటారు. దైవత్వమదే. ప్రత్యేకంగా దేవుడంటూ లేదు. నువ్వు ఏది కోల్పోయావో దాని పట్ల స్పృహతో వుంటే దైవత్వం నీ అనుభవానికి వస్తుంది. నువ్వు జీవితాన్ని కోల్పోయావు, ప్రేమని కోల్పోయావు, సత్యాన్ని కోల్పోయావు. సాహసాన్ని దగ్గరికి చేర్చుకో. సౌందర్యానికి అభిముఖుడివికా. ఆనందానికి, ఆశీర్వాదానికి తల వంచు. సమస్తము నీదే. అది నిన్ను ఆహ్వానిస్తోంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022

No comments:

Post a Comment