శ్రీ మదగ్ని మహాపురాణము - 13 / Agni Maha Purana - 13


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 / Agni Maha Purana - 13 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 5

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీ రామావతార వర్ణనము - 2 🌻

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను. తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను.

మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.

శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.

రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి.

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.

అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -13 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 5

🌻 Manifestations of Viṣṇu as Rama - 2 🌻


The king being requested by (the sage) Viśvāmitra for the annihilation of those who impede (the performance) of the sacrifices sent Rāma and Lakṣmaṇa along with the sage. Rāma who had gone (with the sage) (and) was taught in the use of the weapons (astra[1] and śastra[1]) (became) the killer of (the demoness) Tāṭakā[2].

8. (Rāma) made (demon) Mārīca[3] stupefied by the missile (known as) Mānava and led him far away. The valiant killed also (the demon) Subāhu, the destroyer of sacrifices along with his army.

9. Residing at the (place) Siddhāśrama[4] along with (the sages) Viśvāmitra and others, (Rāma) went along with his brother to see the sacrifice (test for prowess) of Maithila (King Janaka).

10-12. At the instance of (the sage) Śatānanda[5] and on account of the glory of Viśvāmitra, that sage being shown due respects by the king at the sacrifice and Rāma being informed, sportively pulled the bow and broke it. (King) Janaka gave Sītā, the girl not born of the womb, and associated with a prize bid, to Rāma. And when the parents had come, Rāma also married that Jānakī (Sītā). In the same way Lakṣmaṇa (also married) Urmilā.

13-14. Then Śatrughna and Bharata married Śrutakīrti and Māṇḍavī, the two daughters of the brother of Janaka. Rāma after conquering Jāmadagni (Paraśurāma, son of Jamadagni) went to Ayodhyā with (sage) Vasiṣṭha and others and Bharata with Śatrughna went towards (the country of) Yudhājit (uncle of Bharata).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022

No comments:

Post a Comment