అష్టావక్రగీత అధ్యాయము 3

అష్టావక్రగీత 3
                     అధ్యాయము 3

అష్టావక్ర ఉవాచ
3.1
*అవినాశినమాత్మానం ఏకం విజ్ఞాయ తత్వతః*|
*తవాత్మజ్ఞస్య దీరస్య కథమర్థార్జనే రతిః*||

నాసము లేనిది ఒక్కటైనది అయిన ఆత్మను యధార్థముగా తెలిసికొనిన ఆత్మజ్ఞానివి అయిన నీకు సంపదలు ప్రోగుచేయుటయందు ఆసక్తి ఎట్లు?

3.2
*ఆత్మాజ్ఞానాదహో ప్రీతిః విషయభ్రమగోచరే*|
*శుక్తేరజ్ఞానతో లోభో యధా రజతవిభ్రమే*||

ఆహా ఆలూచిప్ప అను జ్ఞానము లేకపోవుటచే వెండి భ్రమ వలన ఆశ పుట్టునట్లు ఆత్మను తెలియకపోవుటచే విషయములు భ్రమ కలిగి ప్రీతి పుట్టుచున్నది

3.3
*విశ్వo స్ఫురతియత్రేదం తరంగా ఇవ సాగరే*|
*సోఅహమస్మితి విజ్ఞాయ కిం దీన ఇవ ధావసి*||

సముద్రమునందు తరంగములవలె ఈ విశ్వము ఎక్కడ తోచుచున్నది అది నేవై ఉన్నావు అని తెలిసియు దీనునివలే పరుగుడుచున్నావేమి

3.4
*శ్రుత్వాఅపి శుద్ధచైతన్యం ఆత్మానమతిసుందరం*|
*ఉపస్థేఅత్యంతసంసక్తో మాలిన్యమధిగచ్ఛతి*||

శుద్ధచైతన్యమే తన ఆత్మానియు వినియు విషయసుఖములందు ఇష్టముతో ఉండువాడు తన ఆత్మాస్దితిని మరుచుచున్నాడు

3.5
*సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మాని*|
*మునేర్జానత ఆశ్చర్యం మమత్వమనువర్తతే*||

సర్వభూతములయందు ఆత్మను ఆత్మయందు సర్వభూతములను చుచుచున్న శాంతసీలుని నాది అను భావము వెంబడించుటఆశ్చర్యము

3.6
*ఆస్దితఃపరమద్వైతం మోక్షార్దేఅపి వ్యవస్దితః*|
*ఆశ్చర్యం కామవసగో వికలః కెలిశిక్షయా*||

గొప్ప అద్వైతమునందు ఉండియు మోక్షమును గట్టిగా కోరుచుండియు కోరికలకు లోబడి కామక్రీడలచే కలతచెందుట ఆశ్చర్యము

3.7
*ఉద్భూతం జ్ఞానదుర్మిత్రం అవదార్యాతిదుర్బలః*|
*ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతమనుశ్రితః*||

జ్ఞానమునుకు చెడు మిత్రుడు కామము పుట్టుట గ్రహించినను పోగాలము సమీపించినను కడు బలహీనుడై మానవుడు కామమునే కోరుచుండుట ఆశ్చర్యము

3.8
*ఇహముత్రవిరక్తస్య నిత్యానిత్యవివేకినః*|
*ఆశ్చర్యం మోక్ష కామస్య మోక్షదేవ బిభిషికా*||

ఇహ పర లోకములయందు విరక్తుడై నిత్యము అనిత్యములను విడతీసి చూడకలిగి మోక్షమును కోరుచున్నవానికి మోక్షమువలననే భయము కలుగుట ఆశ్చర్యము

3.9
*ధీరస్తు భోజ్యమానోఅపి పీడ్యమానోఅపి సర్వదా*|
*ఆత్మానం కేవలం పశ్యన్ న తుష్యతి న కుప్యతి*||

విషయ బోగములలో ఓలలాడించబడినను లేక కష్టములచే పీడింపబడినను ధీరుడు ఎల్లప్పుడు ఆత్మను మాత్రమే చూచుచు సంతోషింపడు కోపించడు

3.10
*చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్యశరీరవత్*|
*సంస్తవే చాపి నిందాయాం కథం క్షుభ్యేన్మహశయః*||

గొప్ప హృదయము కలవాడు పనులు చేయుచున్న తన శరీరమును ఇతరుని శరీరమువలె చూచును అట్టివాడు పోగడ్తలకు తెగడ్తలకు ఎట్లు చలించును?

3.11
*మయామాత్రమిదం విశ్వం పశ్యాన్ విగతకౌతుకః*|
*అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతిధీరదీః*||

మాయమాత్రమైన ఈ విశ్వమును కుతూహాలము లేకుండా చూచుచున్న జ్ఞానముకలవాడు మృత్యువు సమీపించినను ఎట్లు బయపడును?

3.12
*నిఃస్పృహం మానసం యస్య నైరాశ్యేఅపి మహత్మనః*|
*తస్మాత్యజ్ఞానతృప్తస్య తులనా కేన జాయతే*||

ఆత్మజ్ఞానముచే తృప్తుడైన ఏ మహాత్ముని మనసు ఆశలులేని స్థితి మోక్షమునందును ఆశక్తిలేకుండా ఉండునో అట్టివానికి దేనితో పోలిక కుదురును?

3.13
*స్వభావాదేవా జానానో దృశ్యమేతన్న కించన*|
*ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం స కిం పశ్యతి ధీరధీః*||

ఈ దృశ్యము స్వభావముగనే కొంచెమున్ను లేనిదే అని తెలియుచున్న జ్ఞానము కలవాడు ఇది గ్రహించతగినది ఇది విడువతగినది అని దేనిని చూచును?

3.14
*అంతస్త్యక్తకషాయస్య నిర్ధ్వంద్వస్య నిరాశిషః*|
*యదృచ్చయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే*||

లోన దోషములనువీడి ధ్వంద్వములు ఆశలు లేకుండువానికి తనంతట వచ్చిన భోగము దుఃఖమును కాని సుఖమును కాని కలిగించలేదు.

               3 వ  అధ్యాయము సమాప్తం

No comments:

Post a Comment