దుఃఖం

🌿🍃🌿🍃🌿🍃🌿

🌿 *దుఃఖం రెండువైపులా పదునున్న కత్తి వంటిది.*

🌿  *ఒక భాగం మనిషిని ప్రక్షాళన చేసి పునితుడిగా మారుస్తుంది. అతడు సహజ శ్రేయస్సుకు ఉపయోగ పడేలా చేస్తుంది.*

🌿 *మరో భాగం వ్యక్తిగత జీవన వినాశనానికి దారితీస్తుంది అందువల్ల దుఃఖం పట్ల అప్రమత్తంగా ఉండాలి.*

🌿  *జీవితంలో దుఃఖం కలిగించే సంఘటనలు సందర్భాలు అనేకం ఉంటాయి.*

🌿  *వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి దుష్ప్ర భావానికి బలి కాకూడదు కుంగిపోకూడదు.*

🌿  *చిత్రకారుడు ఏడుస్తూ బొమ్మలు ఇస్తాడా? శిల్పి దుఃఖిస్తూ శిల్పాన్ని  చెక్కుతాడా? నృత్యకారుడు రోదిస్తూ నాట్యం చేస్తాడా? గాయకుడు సంగీతకారుడు కుమిలిపోతూ వారి కళలను ఆవిష్కరిస్తారా? లేదు. ఇటువంటి దృశ్యం ఎక్కడా కానరాదు. ఎందుకంటే వారు వర్తమానం లో ఉంటారు అది బ్రహ్మానంద క్షేత్రం అందులో ఉండేది కేవలం ఆనందమే!*

🌿  *ఆ ఆనందంలో మనిషి సృజనాత్మకంగా ఉంటాడు.*
*అందులో నుంచి కొత్త వాటిని కనిపెట్టే నూతన శక్తి పుడుతుంది.*

🌿  *మనిషి దుఃఖంనే పట్టుకుని వేలాడితే అది బలహీనుణ్నీ చేస్తుంది. అప్పుడు ఏ పని చేయకుండా వృధాగా ఉండిపోతాడు ఫలితంగా కుటుంబానికి, సమాజానికి భారంగా మిగిలిపోతాడు.*
*ఇది ఆంతరిక, బాహ్య అనారోగ్య స్థితిని తెలియచేస్తుంది......*

🌿🍃🌿🍃🌿🍃🌿
🙏 *ప్రసాద్*

No comments:

Post a Comment