అష్టావక్ర గీత
అధ్యాయము 1
జనక ఉవాచ
1.1 *కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి *
* వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్భుహి మమ ప్రభో*
హే ప్రభో జ్ఞానమును ఎట్లు పొందవచ్చును? ముక్తి ఎట్లు కలుగును ? వైరాగ్యము ఎట్లు లభించును ? ఈ విషయమును నాకు చెప్పుము
*అష్టవక్ర ఉవాచ*
1.2 *ముక్తిమిచ్ఛసి చెత్తాత విషయాన్ విషవత్ త్యజ *
*క్షమార్జవదయాతోష సత్యం పీయూషవత్ భజ*
నాయనా! ముక్తిని కోరుదువేని విషయములను- విషమువలె విడనాడుము. ఓర్పు నిష్కపట ప్రవర్తన, దయ,సంతోషము,సత్యము అనువానిని- అమృతమువలె సేవింపుము.
1.3 న పృథ్వీ న జలం న వాయుర్ద్యౌర్న వా భవాన్
ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్దిముక్తయే
నీవు భూమివి కావు.జలము కావు. వాయువు కావు ఆకాశము కావు వీనికి సాక్షి అయిన చిత్ రూపమైన ఆత్మను అని ముక్తి కొరకు తెలుసుకోనుము
1.4 యది దేహం పృథక్-కృత్య చితి విశ్రామ్య తిష్టసి
అదునైవ సుఖీ శాన్తో బంధముక్తో భవిష్యసి
దేహమును వేరు చేసికొని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఇప్పుడేసుఖివి, శాంతుడవు, బంధములు పోయినవాడవు కాగలవు
1.5*న త్వం విప్రాదికో వర్ణో నాశ్రామీ నాక్షగోచరః
అసాంగోఅసి నిరాకారోవిశ్వసాక్షీ సుఖీ భవ*
నీవు బ్రాహ్మణమొదలైనకులములు,ఆశ్రమములు కలవాడవు కావు.ఇంద్రియాములకు తెలియబడువాడవు కావు సంగమము లేనివాడవు. ఆకరములేనివాడవు. విశ్వాసాక్షివి. సుఖముగా ఉండుము.
1.6*ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని న తే విభో
న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా*
హే విభో! ధర్మాధర్మములు,సుఖదుఃఖములు మనస్సుకు సంబంధించినవి. నీవు కావు. నీవు కర్తవును కావు భోక్తవును కావు. ఎల్లప్పుడును ముక్తుడవే
1.7 *ఏకో ద్రష్టాఆసి సర్వస్య ముక్తప్రాయోఆసి సర్వదా
అయమేవ హి తే బందో ద్రష్టారం పశ్యసీతరం*
సమస్తమునకు ఒకే ద్రష్టగా ఉన్నావు. ఎల్లప్పుడు ముక్తుడవుగానే ఉన్నావు. ద్రష్టను ఇతరముగాచూచుచున్నావు. అదియే నీకు బంధము
1.8 *అహం కర్తేత్యహంమాన మహాకృష్ణాహిదంశితః
నాహం కర్తేతి విశ్వాసామృతం పేత్వా సుఖీ భవ*
*నేను కర్తను* అను అహంకారము అను పెద్దనల్ల పాముచేత కరువబడితివి. *నేను కర్తను కాను* అను అమృతము త్రాగి సుఖముగా ఉండుము.
1.9 *ఏకో విశుద్ధబోధోఅహం ఇతి నిశ్చయవహ్నినా ప్రజ్వల్యా జ్ఞానగహనం వీతశోకః సుఖీ భవ*
నేను ఒక్కటైన విశుద్ధమైన తెలివి స్వరూపమును అను నిశ్చయము అను అగ్నిచే అజ్ఞానము అను అడవిని తగులబెట్టి సుఖముగా ఉండుము
1.10*యత్ర విశ్వామిదం భాతి కల్పితం రజ్జుసర్పవత్ ఆనందపరమానందః స భోదస్త్వం సుఖం చర*
ఈ విశ్వము త్రాడుయందు పామువలె దేనియందు కల్పింపబడి తోచుచున్నదో అట్టి ఆనంద పరమానందమైన చైతన్యము నీవు సుఖముగా సాగిపొమ్ము
*1.11 ముక్తాభిమానీ ముక్తో హి బద్ధో బద్దాభిమాన్యపి!*
*కింవదంతీహా సత్యేయం యా మతిః సా గతిర్బవేత్!*
*అభిమానమునుండి ముక్తుడైనవాడు ముక్తుడే. అట్లే అభిమానము చేత బద్ధుడైనవాడు బద్ధుడే.*
*1.12 ఆత్మా సాక్షీ విభుః పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియః!*
*అసంగో నిఃస్పృహః శాంతోభ్రమాత్సంసారవానివ!*
*ఆత్మ సాక్షి అంతటా నిండినది ఒక్కటైనది ముక్తము చైతన్యము పనులతో సంబంధములేనిది ఆసక్తి లేనిది శాంతము.*
*1.13 కూటస్ధం భోధమద్వైతం ఆత్మానం పరిభావయ! ఆభసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమదాంతరం!*
*నేను ఆభాసుడను అను భ్రమను బయట వెలుపల తోచు బావములను విడిచి కూటస్ధము ఎరుక ఆత్మను మనసున నిలుపుము.*
*1.14 దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోఅహం! జ్ఞానఖడ్గేన తాన్నికృత్య సుఖీ భవ!*
*బిడ్డా!దేహాబీమానము అను త్రాడుచేత చాలా కాలమునుండి కట్టివేయబడితివి తెలివిని నేను అను జ్ఞానఖడ్గముచేత దానిని కోసివేసి సుఖముగా ఉండుము.*
*1.15 నిస్సంగోనిష్ర్కియోఆసి త్వం స్వప్రకాశో నిరంజనః!*
*అయమేవ హి తే బంధః సమాధిమనుతిష్టసి!*
*నీవు సంగమము లేనివాడవు చేతలు లేనివాడవు సహజమైన ఎరుక కలవాడవు మచ్చ లేనివాడవు అయిననూ సమాధిని అభ్యసించుచున్నావు అదియే నీకు బంధము.*
*1.16 త్వయా వ్యాప్తమిదం విశ్వాo త్వయి ప్రోతం యథార్థతః!*
*శుద్ధబుద్ధస్వరూపస్త్వం మా గమః క్షుద్రచిత్తతాం!*
*నిజముగా ఈ విశ్వము అంతయు నీచే వ్యాపింపబడిఉన్నది నీయందే నేయబడి ఉన్నది నీవు శుద్ధమైన తెలివి స్వరూపము అల్పమైన చిత్తముతో ఉండకుము.*
*1.17 నిరపేక్షో నిర్వికారో నిర్బరః శీతలాశయః!*
*అగాధబుద్ధిరక్షుభ్దో భవ చిన్మాత్రవాసనః!*
*నీవు ఆపేక్ష లేనివాడవు మార్పులు లేనివాడవు పూర్తిగా నిండినవాడవు చల్లని హృదయము కలవాడవు లోతుతెలియని తెలివివి కలత లేనివాడవు చిత్ మాత్ర వాసనతో ఉండుము.*
*1.18 సాకారమనృతం విద్ది నిరాకారం తు నిశ్చలమ్!*
*ఏతత్తత్వోపదేశేన న పునర్భవసంభవః!*
*ఆకారముకలది ఆబద్దామనియు ఆకారములేనిదైతే నిశ్చలమనియు ఎరుగుము ఇట్టి తత్వోపదేశముచేత మరు జన్మ ఉండదు.*
*1.19 యధైవాదర్శమధ్యస్థే రూపేఅన్తః పరితస్తు సః!*
*తథైవాఅస్మిన్ శరీరేఅన్తః పరితః పరమేశ్వరః!*
*అద్దమునందున్న ప్రతిబింబము లోపల వెలుపల అద్దమే ఉండునట్లు ఈ శరీరమునందున్ను లోపల వెలుపల పరమేశ్వరుడే ఉన్నాడు.*
*1.20 ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యదా ఘటే!*
*నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా!*
*కుండ బయట లోపల ఒక్కటిగా అంతటా ఆకాశము ఉండునట్లు బ్రహ్మము సర్వభూతములయందును నిత్యము నిరంతరము ఉండును.*
No comments:
Post a Comment