✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. దేవజలంధర సంగ్రామము - 3 🌻
సనత్కుమారుడిట్లు పలికెను -
శుక్రాచార్యుడు రాహువు యొక్క శిరశ్ఛేదమును గురించి, అమృతము కొరకు దేవతులు సముద్రమును మథించుట గురించి వివరించి చెప్పెను (17). శ్రేష్ఠ వస్తువు లను దేవతలు గొని పోవుట, రాక్షసులు పరాభవమును పొందుట, దేవతలు అమృతపానమును చేయుట అను వృత్తాంతమునంతనూ విస్తరముగా చెప్పెను (18). మహావీరుడు, ప్రతాపవంతుడు అగు జలంధరుడు తన తండ్రి మథింపబడిన వృత్తాంతమును విని కోపించెను. కోపముచు ఆతని కన్నులు ఎరుపెక్కెను (19). స్వాభిమానము గల జలంధరుడు అపుడు ఘస్మరుడనే ఉత్తముడగు దూతను పిలిపించి శుక్రుడు వివరించిన వృత్తాంతమునంతనూ చెప్పెను (20). అప్పుడాతడు బుద్ధశాలియగు ఆ దూతను ప్రీతతో బలుతెరంగుల సన్మానించి అభయమునిచ్చి ఇంద్రుని సన్నిధికి పంపెను (21). జలంధరుని దూత, బుద్ధమంతుడు అగు ఘస్మరుడు దేవతలందరితో విరాజిల్లే స్వర్గమునకు వెళ్లెను (22). ఆ దూత అచటకు వెళ్లి వెంటనే సుధర్మయను దేవసభకు వెళ్లి గర్మముతో తలను పైకెత్తి దేవేంద్రునితో నిట్లు పలికెను (23).
ఘస్మరుడిట్లు పలికెను - జలంధరుడు రాక్షస జనులందరికీ ప్రభువు. సముద్రుని పుత్రుడు. గొప్ప ప్రతాపశాలి. మహావీరుడు. శుక్రుని ఆలంబనము గలవాడు (24). నేను ఆ వీరుని దూతను. నాపేరు ఘస్మరుడు. కాని నేను కార్యనాశకుడను గాదు. ఆ వీరుడు పంపగా నేను మీవద్దకు వచ్చి యుంటిని (25). జలంధరుని ఆజ్ఞకు ఎక్కడైననూ తిరుగు లేదు. కుశాగ్రబుద్ధి యగు ఆతడు రాక్షస శత్రువుల నందరినీ జయించినాడు. ఆతడు చెప్పిన పందేశమును వినుము (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 754🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 The fight between the gods and Jalandhara - 3 🌻
Sanatkumāra said:—
17-18. Thus Bhargava narrated in detail the story of the headless Rahu, of the churning of the ocean pursued by the gods for the gain of nectar, of the removal of the jewels, of the drinking of the Amṛta by the gods and of the harassment to the Asuras.
19. Then on hearing about the churning of his father, the heroic son of the ocean, the valorous Jalandhara became furious and his eyes turned red with anger.
20. Then he called his excellent emissary Ghasmara and told him everything what the wise preceptor had said to him.
21. He then lovingly honoured the clever emissary in various ways, assured him of protection and sent him to Indra as his messenger.
22. Ghasmara, the intelligent emissary of Jalandhara, hastened to heaven[2] where all the gods were present.
23. After going there, the emissary entered the assembly of the gods.[3] With his head kept straight as a token of haughtiness he spoke to lord Indra.
Ghasmara said:—
24. Jalandhara, the son of the ocean, is the lord and emperor of all the Asuras. He is excessively heroic and valorous. He has the support and assistance of Bhargava.
25. I am his emissary. I have been sent by him. I have come to you here. My name is Ghasmara but I am not a devourer.
26. He is of exalted intellect. His behest has never been defied. He has defeated all the enemies of Asuras. Please listen to what he says.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment