శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 462. ‘సురనాయికా’ - 4 🌻


అసుర ప్రజ్ఞలు హద్దు మీరక యుండుటకు కూడ ఆరాధనము ప్రాథమికముగ ఉపకరించును. ఆరాధనము లోతుగ అనునిత్యము సాగునపుడు దేవతా సహకారము లభించును. అపుడు జీవుడు దేహమున దివ్య వైభవముతో జీవించ గలడు. అట్లుకాక దేహబద్ధుడైనపుడు అనేకానేక దుఃఖములకు గురి యగును. కావున సురనాయిక అగు శ్రీమాత నారాధించుట వలన అసుర ప్రజ్ఞలు హద్దులలో నుండును. సుర ప్రజ్ఞలు స్ఫూర్తి నిచ్చి జీవునికి సహకరించుచూ దివ్య లోకానుభవము కలిగించును. అసురులు, సురలు కూడ శ్రీమాత సంతానమే. ఆమెకు ఇరువురునూ సమానమే. కాని అసురులు హద్దులు మీరకుండుట కొఱకై సురలకు నాయికగ నిలచును. అందులకే ఆమె సురనాయిక.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 462. 'Suranaeika' - 4 🌻


Worship is also a fundamental tool for asura's powers to be unbounded. When the worship goes on in unison, God's cooperation is obtained. Then the living being can live with divine splendor in the body. Otherwise, when he is in the flesh, he is subject to many sorrows. Therefore, due to the worship of Suranaika Srimata, the powers of the Asuras are out of bounds. Sura Prajna inspires and helps the living being to experience the divine world. Asuras and Suras are also offspring of Sri Mata. Both are equal to her. But the Asuras want you to have boundaries and stand as the leader of the Suras. That is why she is Suranaika.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment