సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖
🌻 198. 'సమానాధికవర్జితా' 🌻
శ్రీమాత యందు సమానత్వమే కాని ఆధిక్య భావముండదు అని అర్థము.
సమాన, అధిక వర్జితా అని ఈ నామమును ద్వంద్వ నామముగా తెలియవలెను. శ్రీమాత అందరియందును సమానముగనే యుండును. ఉపాధులనుబట్టి హెచ్చు తగ్గులున్నవి గాని, ఉపాధి యందున్నది ఎప్పుడునూ ఒక్కటియే. ఉగ్గుగిన్నె నుండి సముద్రము వరకూ నిండిన నీరుండును. ఉగ్గుగిన్నెలో తక్కువ నీరుండుటకు కారణము నీరు కాదు. గిన్నె పరిమాణము.
సృష్టియందు శ్రీమాత శక్తులు సమానము గనే వ్యాప్తి చెందియున్నవి. అధికము, అల్పము అను వ్యత్యాసములు శ్రీమాతకు లేవు. అందుకొనువారిని బట్టి యుండును. సూర్యకిరణములు సమానముగనే ప్రసరించును. కానీ చీకటి గృహములలోనికి అవి రాలేవు. కారణము గృహనిర్మాణ విధానమే. గాలి, వెలుతురు ఇంటిలోనికి ప్రవేశింపక పోవుటకు సూర్యుడు, వాయుదేవుడు కారణము కాదు. అట్లే నీరు, వేడిమి కూడ.
విద్యుత్తు కొన్ని దీపముల యందు ఎక్కువగ వెలుగుట, కొన్నిటియందు తక్కువగ వెలుగుటకు కారణము దీపముల పరిమాణమే కాని విద్యుత్తునకు సంబంధించినది కాదు. ఉపాధులలో ఉన్న వ్యత్యాసము వలన అందు వసించునది చిన్నదిగను, పెద్దదిగను గోచరించును. అదే విధముగ సృష్టియందున్న ఉపాధులలో శ్రీమాత నిండి యున్నది. ఉపాధి భేదము వలననే స్థావరములు, జంగమములు, మానవులు, దేవతలు, అసురులు ఒకరి కొకరు భిన్నమై గోచరింతురు.
అన్నిటి యందున్న శ్రీచైతన్యము దర్శించు వారికి అధికులని, అధములని భావించుట యుండదు. తెలియని వారికే ఈ భావనలు. తెలిసినవారి కంతయూ చైతన్య విలాసముగనే గోచరించును. తెలియుటకే మూలమైన శ్రీమాత ఈ కారణముగ ఆధిక్యమును చూపదు. ఆమె ఆధిక్యమును, అసుర భావమును వర్ణించినది. ఆమె దృష్టిలో తాను అధికమను భావము లేదు.
కనుక ఇతరులను గూర్చి అల్పులు అన్న భావన కూడ యుండుదు. అధికుల మసుకొన్నవారే కొందరిని అల్పులుగ చూతురు. దివ్యత్వమును అనుసరించువారు దానిని వర్ణింతురు. అట్టివారిని సౌజన్య మూర్తులందురు. చక్రవర్తి కుమారుడు అయివుండి కూడ, శ్రీరాముడు గుహునియందు, శబరియందు, వానరులయందు, అసురుల యందు సమానత్వమునే గరపెను. అట్లే పూర్ణపురుషుడైన శ్రీకృష్ణుడు కూడ గొల్ల పిల్లలతో చల్దులారగించెను. ఆధిక్యత అను భావమును వర్ణించినవారు అందరి హృదయములందు వసించగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 198 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻Samānādhika-varjitā समानाधिक-वर्जिता (198) 🌻
She has no equals. Śvetāśvatara Upaniṣad (VI. 8) says, “He has no body and no organs. No one is His equal. No one is His superior either. He possesses many powers of knowledge and powers of action.” The Upaniṣad talks about the nature of the Brahman.
Arjuna addresses Kṛṣṇa like this in Bhagavad Gīta ( XI.43) “You are the Lord of incomparable might, in all the three worlds there is none else even equal to You; how then, any better?” She has all these qualities.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Feb 2021
No comments:
Post a Comment