భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 224
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 224 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మైత్రేయమహర్షి - 1 🌻
జ్ఞానం:
1. అత్రిమహర్షి పరాశరమహర్షికి శిష్యుడు, ఎప్పుడూ 12 సంవత్సరముల వయసుగ పిల్లవాడివలె కనబడతాడు. పరాశరమహర్షికి ఉన్న త్రికాలజ్ఞానము – సృష్టిలో సమస్త విషయములయొక్క విజ్ఞానము-అనన్య సామానమైనది.
2. ఆయనను ఆశ్రయించి అవన్నీ తెలుసుకుందామనే ఉద్దేశ్యంతో వెళ్ళి ఆయన మైతేయమహర్షి సేవచేసుకున్నాడు. పరాశరమహర్షికి ఉన్న అనేకమంది శిష్యులలో ఈ విద్యను ధారపోస్తే పొండేటటువంటి యోగ్యతను గ్రహించి మైత్రేయమహర్షికి ఇచ్చాడు.
3. మైత్రేయమహర్షి, “సృష్టి చరిత్ర, దానికి కారణ్భూతులెవ్వరు? దానికి పరిణామమేమిటి? జీవులకు అత్త్యుత్తమమైన మోక్షమార్గానికి సులభోపాయం ఏది?” మొదలైన విషయాలన్ని పరాశరుని అడిగాడు. అంటే యోగము, వైరాగ్యము, తపస్సు, సర్వోత్తమమైన వైదికకర్మలయొక్క ఫలము లభింపజేసే ఒక్కమాగమేదైనా ఉందా? ఆ ఫలం లభించటానిని ఏది సులభమైన మార్గము? వంటివన్నీ అడిగాడు.
4. దానికి బదులుగా పరాశరమహర్షి, “ఈ జగత్తంతా విష్ణుమయమే! ఆ విష్ణువే సమస్తదేవతల రూపంలో ఉన్నాడు. అత్డే త్రిమూర్తు, అతడే ప్రకృతి, అతడే పురుషుడు, అతడే జీవుడు, అతడే బంధనము, అతడే ముక్తి” అని బోధించాడు.
5. ఒకసారి విదురుడు మైత్రేయమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, “మునీంద్రా లోకంలోని జనులందరూ, మనస్సులో అనేకమైన సుఖాలను కోరి వాటిని పొందటంకోసమే కర్మలను ఆచరించి, దైవోపహతులై వ్యర్థులవుతారు. కర్మలు బంధకములైన దుఃఖములే కాని సౌఖ్యదాయకములు కావు కదా! అవి పాపనివృత్తి చేయజాలవు. పాపాన్ని కడిగివేసే ఏ కర్మాకూడా లేదు” అన్నాడు.
6. ఇంకా, “ఏదీనె కర్మతో ఒక పాపానికి ప్రాయశ్చిత్తముంది!” అని అడిగాడు. మైత్రేయుడు, ‘ధర్మశాస్త్రాల్లో ప్రాయశ్చిత్తాలున్నాయి. పాపంచేసిన తరువాత ప్రాయశ్చిత్తం అనే మాటకు అర్థం ఏమిటంటే, అది ఒక కర్మ కాదు. తను యథార్థంగా దుఃఖపడి మనసులో చింతించటం.
7. ‘ఒక పాపం నేను చేసాను, ఆ పాపం నన్ను వదులునుగాక! ఆ పాపం నేను చేతులు, కాళ్ళతో చేసాను. యథార్థమైన నా మనోభావన ఆ పాపంనుండి నివృత్తి కావాలి అని కోరుతున్నాను. కాబట్టి నిమిత్తమాత్రంగా ఈ ప్రాయశ్చిత్తకర్మ చేస్తున్నాను’ అని భావించాలి” అని బోధించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment