3-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 139🌹  
11) 🌹. శివ మహా పురాణము - 339🌹 
12) 🌹 Light On The Path - 92🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 224🌹 
14) 🌹 Seeds Of Consciousness - 288 🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 163🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 19 / Lalitha Sahasra Namavali - 19🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 19 / Sri Vishnu Sahasranama - 19 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -139 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 24

*🍀. 22. బ్రహ్మ నిర్వాణము - అంతరంగమున బ్రహ్మము వసించి యున్నది. అది ఆధారముగ చైతన్యము, చైతన్యము ఆధారముగ త్రిగుణములు (త్రిశక్తులు), వాని నాధారము చేసుకొని పంచభూతములు ఏర్పడి యున్నవి. ఇట్లు పది అంశములతో కూడిన స్థూల సూక్ష్మములగు ఏడు పొరలతో ఏర్పడిన రూపమున జీవుడున్నాడు. అందువలననే అతడు దశరథుడు అని, సప్తపర్ణ అని సంబోధింప బడుచున్నాడు. యోగి అంతర్ముఖుడై అంతరంగము నందలి వెలుగుతో రమించుచు, అంతఃసుఖమును పొందుచు, ఆత్మజ్యోతియై ప్రకాశించుచు నుండును. అతడు బ్రహ్మ స్వరూపుడై బ్రహ్మము నందు నిర్వాణము చెందుచున్నాడు. బ్రహ్మమునందు యుక్తము చెందుట యోగమగును. తొమ్మిది ఆవరణలు దాటి పదియవ అంశమగు బ్రహ్మముతో భావపరమగు యోగము చెందుట ప్రధానము. అపుడు చైతన్యము పరిపూర్ణమై వెలుగును. 🍀*

యోఽoతః సుఖోఽoతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ।। 24 ।।

యోగి అంతర్ముఖుడై అంతరంగము నందలి వెలుగుతో రమించుచు, అంతఃసుఖమును పొందుచు, ఆత్మజ్యోతియై ప్రకాశించుచు నుండును. అతడు బ్రహ్మ స్వరూపుడై బ్రహ్మము నందు నిర్వాణము చెందుచున్నాడు. 

అంతరంగమున బ్రహ్మము వసించి యున్నది. అది ఆధారముగ చైతన్యము, చైతన్యము ఆధారముగ త్రిగుణములు (త్రిశక్తులు), వాని నాధారము చేసుకొని పంచభూతములు ఏర్పడి యున్నవి. ఇట్లు పది అంశములతో కూడిన స్థూల సూక్ష్మములగు ఏడు పొరలతో ఏర్పడిన రూపమున జీవుడున్నాడు. అందువలననే అతడు దశరథుడు అని, సప్తపర్ణ అని సంబోధింప బడుచున్నాడు.

ఈ మొత్తమునకు మూలము బ్రహ్మమే గదా! అట్టి బ్రహ్మమునందు యుక్తము చెందుట యోగమగును. తొమ్మిది ఆవరణలు దాటి పదియవ అంశమగు బ్రహ్మముతో భావపరమగు యోగము చెందుట ప్రధానము. అపుడు చైతన్యము పరిపూర్ణమై వెలుగును. 

గుణములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు, పంచాంగములు అట్టి చైతన్యమునకు లోబడి యుండును. పై విధముగ భావన చెందినపుడు అంతరంగమున తన జ్యోతిస్వరూపము గోచరించును. 

ఆ స్వరూపమునకు మూలమైన తత్త్వము అందలి సూక్ష్మ స్పందన బిందువుగ గోచరించును. అదియే పరమాత్మ స్థానము. దానియందు రమించుచున్న యోగికి, బుద్ధి మనో యింద్రియముల కతీతముగ సుఖము లభించు చుండును. 

ఆ బిందు స్థానమున లగ్నమైన చైతన్యము కలవాడగుటచే అచ్చటి బ్రహ్మము యొక్క సాన్నిధ్యమును పొందును. క్రమముగ బ్రహ్మమే యగును. తానుండక బ్రహ్మ ముండును. 

తాను బ్రహ్మమునందు నిర్వాణము చెందును. ఇట్లు యోగి అంతర్ముఖుడై బ్రహ్మ సాయుజ్యమును పొందగలడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 340 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
86. అధ్యాయము - 41

*🌻. దేవతలు శివుని స్తుతించుట -1 🌻*

విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి -

దేవదేవా! మహాదేవా! హే ప్రభో! నీవు పరబ్రహ్మ అగు శంభుడవని నీ కృపచే ఎరుంగుదుము (1). తండ్రీ! పరమేశ్వరా! మానవులను మోహింపచేయునది, తెలియ శక్యము కానిది, సర్వోత్కృష్టమైనది అగు నీ మాయచే మమ్ములను ఏల మోహింపజేయుచున్నావు? (2) జగత్తునకు యోని అగు ప్రకృతి కంటె, బీజమగు పురుషుని కంటె ఉత్కృష్టము అగు పరబ్రహ్మ నీవు. నీవు మనస్సునకు, వాక్కునకు అందవు (3). నీవు స్వేచ్ఛచే నీ స్వరూపమైన శివ శక్తిని వశము చేసుకొని, సాలెపురుగు గూటిని వలె, ఈ జగత్తును సృష్టించి పాలించి లయము చేయుచున్నావు. ఇది నీలీల (4).

ఓ ఈశ్వరా! దయానిధివగు నీవే యజ్ఞమును సృష్టించితివి. ఋగ్యజుస్సామ రూపము అగు వేదమును లోకములో ప్రవర్తింపజేయుటకై సృష్టింపబడిన ఆ యజ్ఞమును దక్షిణయను సూత్రముతో దృఢము చేసితివి (5). స్వీకరింపబడిన వ్రతము గలవారు, వేదమార్గములో నిష్ణీతులునగు వేతవేత్తలు లోకమునందు నీ చేతనే నిర్మింపబడిన శుద్ధములగు ధార్మిక నిలయములను శ్రద్ధతో ఆచరించుచున్నారు (6). మంగలములను గాని, అమంగళ కర్మలను గాని ఆచరించువారికి నీవు స్వపర భేదము లేకుండగా హితకరములగు ఫలములను, అహిత ఫలములను, మరియు మిశ్రమ ఫలములను కర్మానురూపముగా ఇచ్చెదవు (7). ప్రాణులకు కర్మ ఫలముల నన్నిటినీ ఇచ్చే దాతవు నీవే. సర్వమానవులు చేయు కీర్తి గానములన్నియు ఆయా వ్యక్తులకు గాక నీకు మాత్రమే చెందునని వేదములు ఉద్ఘాటించుచున్నవి (8).

వేర్పాటు బుధ్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరచువారు, కేవల కర్మఠులు అగు మూర్ఖులు పరుష వచనములతో ఇతరులను బాధించెదరు (9). హే విభో! అట్టిదైవద్రోహుల ఆగడములు మితిమీరినపుడు వారిని సంహరించవలసినదే. కాని హేభగవాన్‌ ! పరమేశ్వరా!పరమాత్మా! ప్రభూ! దయను చూపుము (10). శాంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ, జటాజూటధారి, మహేశ్వరుడు, మహాజ్యోతి స్స్వరూపుడునగు రుద్రునకు నమస్కారము (11). 

జగత్తును సృష్టించు ప్రజాపతులను నీవే సృజించితివి. సృష్టికర్తవు నీవే. సృష్టికర్తకు తండ్రివి నీవే. త్రిగుణ స్వరూపుడవు నీవే. నిర్గుణుడవు నీవే. నీవు ప్రకృతికంటె పురుషుని కంటె ఉత్కృష్టమైనవాడవు (12). నల్లని కంఠము గలవాడు, జగత్సృష్టి కర్త, పరమాత్మ, జగత్స్వరూపుడు, జగత్తునకు బీజమైనవాడు, జగత్తునకు ఆనందమును కలిగించువాడు అగు నీ కొరకు నమస్కారము (13).

ఓం వషట్‌, హంత, స్వధా అను యజ్ఞోపయోగి వేదశబ్దములు నీ స్వరూపమే. సర్వక్రతువులను ప్రవర్తిల్ల జేయువాడువు నీవే. హవ్యము (దేవతలకు అర్పింపబడిన అన్నము) ను, కవ్యము (పితురుల కర్పింపబడిన అన్నము) ను భుజించునది నీవే (14). ధర్మపరాయణుడవగు నీవు యజ్ఞమును ఎట్లు భంగపరచ గల్గితివి ? ఓ మహాదేవా!వేదస్వరూపుడవు నీవు యజ్ఞమును ఎట్లు ధ్వంసమొనర్చితివి? హే విభో! (15) బ్రాహ్మణులను గోవులను, మరియు ధర్మమును రక్షించునది నీవే. హే ప్రభో !సత్స్వరూపుడు, అనంతుడు అగు నీవు సర్వప్రాణులకు శరణు పొంద దగినవాడవు (16). 

హే భగవాన్‌! రుద్రా! సూర్యుని కంటె అధికమగు తేజస్సు గలవాడు జగద్రూపుడు, ప్రకాశ స్వరూపుడు, జలములలోని రసతన్మాత్ర స్వరూపుడు నగు నీ కొరకు నమస్కారము (17).

గంధము నిత్యగుణముగా గల పృథివి స్వరూపమైన శర్వునకు నమస్కారము. మహాతేజశ్శాలి, అగ్ని స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (18). హే ఈశా! స్పర్శ గుణము గల వాయువు నీ స్వరూపము. నీకు అనేక నమస్కారములు. సర్వప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడు, సృష్టికర్త అగు నీకు నమస్కారము (19). శబ్ద గుణకమగు ఆకాశము స్వరూపముగా గల భీమునకు నమస్కారము. ఉమాదేవితో గూడి జగత్తును రక్షించే మహాదేవుడవగు నీకు నమస్కారము (20).

భయంకరమైనవాడు, సూర్య రూపుడు, కర్మయోగి అగు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువు అగు నీకు నమస్కారము. హే రుద్రా! నీకోపమునకు నమస్కారము (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 92 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 14th RULE
*🌻 14. Desire peace fervently. The peace you shall desire is that sacred peace which nothing can disturb. - 2 🌻*

357. It is said here that the holy flower grows upon the still lagoons. It is only in still water that the lotus can unfold itself to its best; it cannot do so if it is buffeted about by wind and storm.

It is only in peace that the soul can unfold. Storms of passion and desire are just like storms that beat down the flowers on the physical plane. All developments of the higher kind are like very delicate flowers, and if they are subjected to violent storms of passion they become crushed out, and disappear. 

People who are always in royal rages, who constantly brood over all kinds of foolish personal matters, who are always thinking about their own feelings and are filled with jealousy and envy of others, cannot develop all the fine and delicate fronds and tendrils that mean progress.

358. People in general have very little scientific idea of what occult progress, real evolution, means. 

Their methods of education alone show that they do not understand it. There is a certain amount of the evolution through which we have gone – up to about the level of the savage and a little higher than that – which we may consider as fairly definitely estabished; that is to say, we could not very well fall back below that point under any circumstances. But the growth that comes beyond that – beyond the almost animal part, or at any rate the lower and emotional part, of man – is a question of exceedingly delicate development of many sorts. 

The things which differentiate the highly cultured and artistic person from the quite coarse and undeveloped person are all of a very subtle nature – matters of long and slow and careful growth; they are tender shoots of great promise, which have hardly as yet blossomed forth, and have certainly not yet reached what they shall be in the future. The first blast of unfavourable conditions destroys that finer growth. 

The rough and tumble of modern education, in which children are frightened and sometimes even ill-treated, has the effect of crushing out all the delicate bloom of culture and refinement which souls that have come into these child bodies may have been acquiring for a very long time past – perhaps for twenty or thirty lives. 

In consequence the children become very much like primitive savages. They are often full of fear and hatred and a great sense of abiding injustice, and all the finer development which really marks the difference between a later and, an earlier sub-race is swept away.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 224 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మైత్రేయమహర్షి - 1 🌻*

జ్ఞానం:
1. అత్రిమహర్షి పరాశరమహర్షికి శిష్యుడు, ఎప్పుడూ 12 సంవత్సరముల వయసుగ పిల్లవాడివలె కనబడతాడు. పరాశరమహర్షికి ఉన్న త్రికాలజ్ఞానము – సృష్టిలో సమస్త విషయములయొక్క విజ్ఞానము-అనన్య సామానమైనది. 

2. ఆయనను ఆశ్రయించి అవన్నీ తెలుసుకుందామనే ఉద్దేశ్యంతో వెళ్ళి ఆయన మైతేయమహర్షి సేవచేసుకున్నాడు. పరాశరమహర్షికి ఉన్న అనేకమంది శిష్యులలో ఈ విద్యను ధారపోస్తే పొండేటటువంటి యోగ్యతను గ్రహించి మైత్రేయమహర్షికి ఇచ్చాడు.

3. మైత్రేయమహర్షి, “సృష్టి చరిత్ర, దానికి కారణ్భూతులెవ్వరు? దానికి పరిణామమేమిటి? జీవులకు అత్త్యుత్తమమైన మోక్షమార్గానికి సులభోపాయం ఏది?” మొదలైన విషయాలన్ని పరాశరుని అడిగాడు. అంటే యోగము, వైరాగ్యము, తపస్సు, సర్వోత్తమమైన వైదికకర్మలయొక్క ఫలము లభింపజేసే ఒక్కమాగమేదైనా ఉందా? ఆ ఫలం లభించటానిని ఏది సులభమైన మార్గము? వంటివన్నీ అడిగాడు. 

4. దానికి బదులుగా పరాశరమహర్షి, “ఈ జగత్తంతా విష్ణుమయమే! ఆ విష్ణువే సమస్తదేవతల రూపంలో ఉన్నాడు. అత్డే త్రిమూర్తు, అతడే ప్రకృతి, అతడే పురుషుడు, అతడే జీవుడు, అతడే బంధనము, అతడే ముక్తి” అని బోధించాడు.

5. ఒకసారి విదురుడు మైత్రేయమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, “మునీంద్రా లోకంలోని జనులందరూ, మనస్సులో అనేకమైన సుఖాలను కోరి వాటిని పొందటంకోసమే కర్మలను ఆచరించి, దైవోపహతులై వ్యర్థులవుతారు. కర్మలు బంధకములైన దుఃఖములే కాని సౌఖ్యదాయకములు కావు కదా! అవి పాపనివృత్తి చేయజాలవు. పాపాన్ని కడిగివేసే ఏ కర్మాకూడా లేదు” అన్నాడు. 

6. ఇంకా, “ఏదీనె కర్మతో ఒక పాపానికి ప్రాయశ్చిత్తముంది!” అని అడిగాడు. మైత్రేయుడు, ‘ధర్మశాస్త్రాల్లో ప్రాయశ్చిత్తాలున్నాయి. పాపంచేసిన తరువాత ప్రాయశ్చిత్తం అనే మాటకు అర్థం ఏమిటంటే, అది ఒక కర్మ కాదు. తను యథార్థంగా దుఃఖపడి మనసులో చింతించటం.

 7. ‘ఒక పాపం నేను చేసాను, ఆ పాపం నన్ను వదులునుగాక! ఆ పాపం నేను చేతులు, కాళ్ళతో చేసాను. యథార్థమైన నా మనోభావన ఆ పాపంనుండి నివృత్తి కావాలి అని కోరుతున్నాను. కాబట్టి నిమిత్తమాత్రంగా ఈ ప్రాయశ్చిత్తకర్మ చేస్తున్నాను’ అని భావించాలి” అని బోధించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 288 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 137. The birth principle is 'Turiya' (the fourth state) which means 'where consciousness is'.🌻*

Careful observation of the whole process of reproduction, either sexual or other types prevalent in nature, has shown that it is a strongly self assertive phenomenon. Every living species wants to propagate and perpetuate and the self assertive 'I am' is the birth principle that is integral to the whole process.  

Since the birth principle was difficult to define or classify, it was simply called 'Turiya' by the ancient thinkers. The word 'Turiya' means 'the fourth', i.e. the fourth state of consciousness that lies at the very base of the other three, which are: waking, dream and deep sleep. It also means 'where the consciousness is'.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 163 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 1 🌻*

633. ఆత్మ ప్రతిష్టాపన స్థితి దాటిన తరువాత కుతూబీయత్ స్థితిలో భగవంతుని జీవితమును గడుపును.ఇట్టివారే-కుతుబ్ లు లేక, సద్గురువులు లేక పరమగురువులు.

634. సద్గురువనగా మానవుడు భగవంతుడయ్యె 

635. సద్గురువులు, సలీక్. వలెనే, ఏకకాలమందే అటు భగవంతుని అనంత సచ్చిదానందస్థితిని ఇటు మానవుని సాధారణ చైతన్య స్థితిని ఎరుకతో అనుభవించుటయే గాక, తన అనంతశక్తులను మాయాబధ్దులైన వారి విమోచనమునకై వినియో గింతురు. పరమాత్మలో C సగుణసాకార స్థితి.ననుట.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 19 / Sri Lalita Sahasranamavali - Meaning - 19 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 19. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |*
*పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ‖ 19 ‖ 🍀*

44) నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - 
గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.

45) పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - 
పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 19 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 19. nakha-dīdhiti-saṁchanna-namajjana-tamoguṇā |
padadvaya-prabhājāla-parākṛta-saroruhā || 19 || 🌻*

44) Nakadhi dhithi samchanna namajjana thamoguna -   
She who removes the darkness in the mind of her devotees by the sparkle of nails. 

45) Pada dwaya Prabha jala parakrutha saroruha -   
She who has two feet which are much more beautiful than lotus flowers. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 19 / Sri Vishnu Sahasra Namavali - 19 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మృగశిర నక్షత్ర ౩వ పాద శ్లోకం*

*🍀 19. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|*
*అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్|| 19 🍀*

అర్ధము :
🍀 173) మహాబుద్ధిః - 
అద్భుతమైన జ్ఞానము కలవాడు, జీవులకి బుద్ధిని ప్రసాదించువాడు. 

🍀 174) మహావీర్యః - 
అన్ని సృజనాత్మక మఱియు దివ్య శక్తులకు ఆధారమైనవాడు.

🍀 175) మహాశక్తిః - 
క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తులకు మూలమైనవాడు.

🍀 176) మహాద్యుతిః - 
దివ్యమైన, భవ్యమైన కాంతితో విరాజిల్లువాడు, అఖండ తేజోమయుడు.

🍀 177) అనిర్దేశ్యవపుః - 
వర్ణించుటకు, ఊహించుటకు వీలుకాని దివ్య మంగళమూర్తి. 

🍀 178) శ్రీమాన్ - 
లక్ష్మీ వల్లభుడు; సకలైశ్వర్యవంతుడు. 

🍀 179) అమేయాత్మా - 
ఊహింపరాని దివ్యాత్మ స్వరూపుడు.

🍀 180) మహాద్రిధృత్ - 
కూర్మమూర్తిగా, కృష్ణునిగా పర్వతములను ఎత్తినవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 19 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Mrugasira 3rd Padam*

*🌻 19. mahābuddhirmahāvīryō mahāśaktirmahādyutiḥ |*
*anirdeśyavapuḥ śrīmānameyātmā mahādridhṛk || 19 || 🌻*

🌻 173) Mahābuddiḥ: 
The wisest among the wise.

🌻 174) Mahāvīryaḥ: 
The most powerful one, because Ignorance which is the cause of Samsara is His great power.

🌻 175) Mahāśaktiḥ: 
One with great resources of strength and skill.

🌻 176) Mahādyutiḥ: 
One who is intensely brilliant both within and without.

🌻 177) Anirdeśya-vapuḥ: 
One who cannot be indicated to another as: 'He is this', because He cannot be objectively known.

🌻 178) Śrīmān: 
One endowed with greatness of every kind.

🌻 179) Ameyātmā: 
The Spirit with intelligence that cannot be measured by any one.

🌻 180) Mahādridhṛk: 
One who held up the great mountain 'Mandara' at the time of the churning of the Milk Ocean and also Govardhana in his Krishna incarnation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share 
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/     

Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

Join and Share 
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ 

Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  
www.facebook.com/groups/vishnusahasranam/

Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita 
www.facebook.com/groups/bhagavadgeetha/

Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA 
www.facebook.com/groups/yogavasishta/

Join and Share వివేక చూడామణి viveka chudamani 
www.facebook.com/groups/vivekachudamani/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment