గీతోపనిషత్తు - 64


🌹. గీతోపనిషత్తు - 64 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 1. ఉపదేశము -వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణమగును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 1
📚


01. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్ |

వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాక వే2 బ్రవీత్ || 1


నేనీ యోగమును సూర్యుని కుపదేశించగ సూర్యుడు

వైవస్వత మనువున కుపదేశించెను.

అతడు ఇక్ష్వాకున కుపదేశించెను అని భగవానుడు పలికినాడు గదా! 'నేను' అంతర్యామి యగు వాసుదేవ ప్రజ్ఞ కాగ సూర్యుడహంకార స్వరూపుడగు సంకర్షణ ప్రజ్ఞ. అతనికుపదేశమై సిద్ధి పొందుటచే అతని నుండి అంతర్యామి ప్రజ్ఞ మనువునకు ఉపదేశ పూర్వకముగ చేరినది. అతని బుద్ధి అంతర్యామిచే వెలిగింపబడినది. అతని నుండి అంతర్యామి ఉపదేశపూర్వకముగ భూమికి రాజుయైన ఇక్ష్వాకునకు చేరినది.

ఇక్ష్వాకును చేరిన అంతర్యామి ప్రజ్ఞ భూమిని నాలుగు పాదముల ధర్మమును నిలిపి పాలించినాడు. అట్లు యోగము పరిపూర్ణమైనది.

ఇక్ష్వాకు అనగా మనస్సు. మనస్సు శరీరమునకు రాజు. మనసే ఇంద్రియముల ద్వారా శరీరమును పోషించును, నడిపించును, పాలించును కూడ.

దివ్యత్వము మనసును చేరినచో మనసు దివ్యమై శరీర ధాతువులయందు వలసిన మార్పులేర్పరచి వాసనలను పారద్రోలి దివ్యకార్యమునకు సమర్పించును. అపుడే యోగము పరిపూర్ణమైనట్లు. అంతర్యామి అవతరించినట్లు.

అందరిలోని అంతరాత్మ అహంకారము, బుద్ధి, మనసుల లోనికి ప్రవహించుట వలన అవతరణము జరుగును. అపుడు శరీరము దివ్యమై ఇంద్రియముల ద్వారా పరిసరములకు దివ్యత్వమును ప్రసరింప చేయును. అవరోధములు లేక ఇంద్రియముల ద్వారా ప్రసరింప చేయగలవు. అట్టి స్థితి నొందిన మనస్సును అనిరుద్ధు డందురు. హృదయమున నిలచి తన చూపు, మాట, స్పర్శ, సాన్నిధ్యాదులతో అందరిని ప్రచోదనము గావించును. అట్టివాడు పరిపూర్ణ యోగి.

వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణ మగును. ఇట్లు దైవమే యోగము తానుగ నందించుచున్నాడని ఉపదేశ మార్గమును, రహస్యమును భగవానుడు తెలిపెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹





Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
🌹
https://t.me/ChaitanyaVijnanam


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom


Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/SriMataChaitanyam


JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra


Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/


🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA


🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/


JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness


30 Oct 2020

No comments:

Post a Comment