భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 11
🌻

442. మనోమయ గోళమందలి రెండవ భాగము అనుభూతులకు (హృదయము) అధికారి యందున్న సాధకుడు (సత్పురుషుడు) భగవంతుని నిజ స్వరూపమును ప్రత్యక్షముగా దివ్యా నేత్రము ద్వారా ఎల్లెడల చూచుచున్నాననెడి భావానుభూతిని పొందును. కాని తనను భగవంతునిలో భగవంతునిగా చూడలేదు. ఇదియే బ్రహ్మ సాక్షాత్కారము (ఆత్మ ప్రకాశము).

443. ఇతడు మహిమలు ప్రదర్శించడు.

444. ఇచట దర్శనము అనెడి ఇంద్రియ పరిజ్ఞానము మిగిలి యున్నది.

445. భౌతిక , సూక్ష్మ చైతన్యములు గల ఆత్మల యొక్క అనుభూతులపై అధికారము కల్గి వాటిని పరిపాలించును.

446. పరుల మనస్సుల యొక్క తలపుల యందును, తలపులు సృష్టించుట యందును సమర్ధుడగును. ఆత్మనిగ్రహము కలవాడగును.

447. సృష్టి అనుభవమంతయు మిథ్య ఎందుచేతననగా--సృష్టి సంబంధమైన సమస్త అనుభవములు సంస్కారముల వలన కలిగినవి. ఆ సంస్కారములు అభావము నుండి పుట్టినవి గనుక.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


23 Nov 2020

No comments:

Post a Comment