శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 104, 105, 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 104, 105, 106

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 57 / Sri Lalitha Sahasra Nama Stotram - 57 🌹
ప్రసాద్ భరద్వాజ



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 104, 105, 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 104, 105, 106 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖


🌻 104. 'రుద్రగ్రంథి విభేదినీ' 🌻

రుద్రగ్రంథి ద్వయమును విశేషముగ భేదించునది శ్రీదేవి యని అర్థము.

స్వాధిష్ఠానమున బ్రహ్మగ్రంథి భేదనము, మణిపూరకమున విష్ణు గ్రంథి భేదనము తెలుపబడినవి. రుద్రగ్రంథి భేదనము అనాహత చక్రమున జరుగును. పంచభూతములలో భూమి, జలము బ్రహ్మ గ్రంథిచే నియమింపబడును. అగ్ని, దాని తేజస్సు విష్ణుగ్రంథిచే నియమింప బడును.

వాయువు, ఆకాశము రుద్రగ్రంథిచే నియమింప బడును. రుద్ర గ్రంథిని భేదించుట యనగా వాయువును ఆకాశమున చేర్చి, ఆకాశ తరంగములను దాటి చిదానంద స్థితిని చేరుట. శరీరము పంచభూతాత్మకము. అందు జీవుడు వసించి యుండును.

పంచభూతములకు మూలము ఆకాశమే. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని (తేజస్సు), దాని నుండి జలము, దాని నుండి భూమి పుట్టుచున్నవి. వీనియందు ఉపస్థితుడైన జీవుడు క్రమముగ వీనిని దాటుటయే గ్రంథి భేదనము.

శ్రీదేవి మొదట త్రిగుణాత్మికయై అందుండి పంచభూతములను సృష్టించినది. త్రిగుణములు పంచభూతములు కలిసి ఎనిమిది స్థానముల నేర్పరచినది. అవియే అష్ట ప్రకృతులు. అందు జీవుని ప్రవేశింపజేసి సృష్టి నిర్మాణము పూర్తి చేయును. ఆరోహణ క్రమమున జీవుడు, అమ్మ అనుగ్రహము ద్వారా వీటిని మరల దాటి స్వతంత్రుడై సృష్టి వైభవమును పొందును.

భూమి, జలముల కేంద్రములు మూలాధారము, స్వాధిష్ఠానము. అచట జీవుని నియమించునది బ్రహ్మగ్రంథి. మణిపూరకము అగ్ని స్థానము, భావమయ స్థానము. అచ్చట జీవుని నియమించునది విష్ణుగ్రంథి. అనాహతము, విశుద్ధి వరుసగా వాయువు, ఆకాశమునకు సంబంధించిన కేంద్రములు. వీనిని నిర్వర్తించునది రుద్రగ్రంథి. ఆజ్ఞ యందు జీవుడు స్వస్వరూపుడు, త్రిగుణాత్మకుడు మరియు విదేహుడు.

అనగా పంచభూతములతో కూడిన దేహము లేనివాడు. ఇతనినే హంస స్వరూపుడందును. విష్ణుగ్రంథి భేదన సమయమున జీవుడు తనయందు విష్ణువే స్వరూపము కొనియున్నాడని, భౌతిక దేహము తన విష్ణు రూపమునకు కవచమని తెలిపితిమి. రుద్రగ్రంథి భేదనమున నిజమునకున్నది విష్ణువే యనియు, తాను కాదనియు తెలియును. 'విశ్వం విష్ణుః' అను సత్యము దర్శనమగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 104 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Rudragranthi-vibhedinī रुद्रग्रन्थि-विभेदिनी (104) 🌻

She breaks the Rudra granthi and proceeds to sahasrāra. This is the last of the three knots. It has already been seen that Pañcadaśī mantra has three kūṭa-s and each kūṭa ends with hrīṃ (ह्रीं).

Therefore, Pañcadaśī mantra has three hrīṃ-s. Each hrīṃ represents one granthi or knot. The bīja hrīṃ represents the candra kalā, (divisions of moon) whereas the other bīja-s in each of the kūṭa-s represent agni (fire), sun and moon (Please refer details at the end of nāma 84).

Once this granthi is crossed, Kuṇḍalinī reaches sahasrāra where she unites with Śiva. However, there are minor cakra-s in between ājñā and sahasrāra. The union of Śiva and Śaktī is represented by the bījā hrīṃ. Pañcadaśī mantra represents only the six cakra-s and three granthi-s.

It does not mention about sahasrāra, which is beyond the subtler (kāmakalā) and subtlest (Kuṇḍalinī) forms of Lalitāmbikā. Once this last granthi is passed over, all the vāsana-s (impressions) go away leading to supreme knowledge. Till this point Kuṇḍalinī had to cross too many resistances to reach Her final destination.

In the next nāma Her destination is explained. During the last leg of one’s journey to his domicile, (for example the flight is about to land) one always feels the happiness of seeing his dear ones.

This is the sort of happiness She derives at this stage. She grants whatever boons one asks for at this cakra.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 105 / Sri Lalitha Chaitanya Vijnanam - 105 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖


🌻 105. 'సహస్రారాంబుజారూఢా' 🌻

వేయి సంఖ్యల దళములు గల పద్మము అధిష్ఠించియున్న శ్రీదేవి అని అర్థము.

సహస్ర అను పదము సంకేత పదము. అది మంత్రము కూడ. 'స' అను అక్షరము పరతత్త్వమునకు సంకేతము. 'హ' అను అక్షరము పరాశక్తికి సంకేతము. 'స్ర' అను అక్షరము అగ్నిబీజము. ఆధారముగ నేర్పడిన సృష్టియని అర్థము.

ఈ మంత్రము యొక్క రహస్యార్థము, సహస్రారకమల దర్శనులకు మాత్రమే తెలియగలదు. అత్రి ఆదిగాగల మహర్షులు ఈ మంత్రశక్తి నెరిగియున్నారు. సమస్త సృష్టి స్థితి లయ కార్యములు అవగతమై తమవంతు కర్తవ్యము నిర్వర్తించు శ్రీదేవి పరమ భక్తులకే ఈనామ రహస్యము తెలియగలదు. ఇతరులు తెలియలేరు.

ఈ మంత్ర రహస్యము తెలిసినవారు త్రిగుణముల కాధారమైన మూలశక్తిని తెలిసినవారే. మూల ప్రకృతిని తెలిసినవారే. అత్రి మహర్షి అనసూయత్వము ఆధారముగ సాగించిన తపస్సు ఫలముగ ఈ మంత్ర రహస్యము నెరిగినారు.

అతడు శాంతివంతుడు, క్రతుక్రియానిష్ఠుడు, సత్త్వగుణోపేతుడు, శ్రద్ధావంతుడు మరియు కళావంతుడును. అతని యందు శ్రీదేవి పదహారు కళలు భాసించును. అనసూయాదేవి అత్రి మహర్షిని ఆరాధించి జగన్మాత స్థితిని పొందినది. త్రిగుణాతీతులే సహస్ర దళ పద్మమున స్థితికొనగలరు.

'సహస్ర' అను నామమునకు వేయి (1,000) అని అర్థము. వేయి అనగా మూడు లోకముల కవ్వలి తత్త్వము అని అర్థము. తత్త్వ మొకటియే. అది ఆధారముగ సువర్లోకము, భువర్లోకము, భూలోకము ఉద్భవించినవి.

సహస్రార దళ పద్మమందు శ్రీదేవి యున్నదనగా ఆమె లోకాతీత, గుణాతీత యని అర్థము. అది పరమ పదము. అచట దేవి శివుని కూడియుండును. శివ తత్త్వము నాధార ముగ సమస్త సృష్టియు త్రిగుణముల ద్వారా ఏర్పరచి మూలాధార చక్రము వరకును వ్యాపించును.

ఈ మొత్తము మార్గమంతయు అమ్మ చైతన్యమార్గమే. ఈ మార్గమున అమ్మ నిరాటంకముగ ఆరోహణము, అవరోహణము చేయుచు నుండును. ఆమె స్వస్థానము సహస్రారము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 105 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Sahasrārambujārūḍhā सहस्राराम्बुजारूढा (105) 🌻

She has now reached Her destination, the sahasrāra, where Śiva is waiting for Her. Sahasrāra is just below the brahmarandhra, an orifice in the skull that connects to cosmos (The existence of this orifice has not been medically proved.

Perhaps this is like the pores that exist in our skin through which sweat comes out. But one can distinctly feel the cosmic connection through this orifice). The union of Śiva and Śaktī takes place at sahasrāra. The sādhaka, who all along was worshipping only the Śaktī, begins to worship Her along with Her creator, Śiva.

There are fifty alphabets in Sanskrit (in another version it is fifty one including one more ḻa ळ). Based on these alphabets and multiplying this fifty by numeric twenty (made up of five basic elements, five karmendriya-s, five jñānendriya-s and five tanmātra-s) one thousand is arrived.

This one thousand is said to be the number of psychic petals of an imaginary lotus flower in sahasrāra.

Please refer ‘further reading on Sanskirt letters’ at the end of nāma 833).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 106 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |*
*సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖*

*🌻 106. 'సుధాసారాభివర్షిణీ, 🌻*

సహస్రార కమలము యొక్క 'కర్ణిక' (తూడు లేక కాడ) నుండి అమృతధారలు వర్షింప చేయునది శ్రీదేవి అని అర్థము. 

సహస్ర దళ పద్మముయొక్క తూడు లేక కాడ వెన్నెముక యందలి సుషుమ్న నాడిగ మూలాధారము వరకు వ్యాపించి యుండును. ఈ నాడి నుండి శ్రీదేవి తెలివిని, ప్రాణమును ప్రసరింపచేయును. తూడు నందు అచ్చటచ్చట కణుపు లేర్పడి షట్చక్రము లేర్పడును. అచట గ్రంథులు కూడ ఏర్పడును. గ్రంథులు స్రవించు లక్షణము గలవి. 

సాధకుని చైతన్య స్ఫూర్తిని బట్టి అమ్మ అనుగ్రహముగ ప్రతి గ్రంథియు తత్సంబంధిత జ్ఞానమును, ప్రాణమును మిక్కుటముగ వర్షింప చేయగలదు. ఇట్లు వర్షింపచేయు గ్రంథులను ధేనువులని, కామధేనువులని ఋషులు సంకేతించిరి. శ్రీవిద్య, బ్రహ్మ విద్య, యోగవిద్య ఆదిగా గల మార్గమున సుధాసారము వర్షితము కాగలదు. సామాన్య మానవులకు షట్చక్రముల గ్రంథుల నుండి నరములు, నాడులు ఆధారముగ ప్రాణము, తెలివి శరీరమున తగుమాత్రముగ ప్రసరించు చుండును.

సాధనా మార్గమున ఈ గ్రంథులను పరిపుష్టము గావించుకొని వానిని కామధేనువులుగ తీర్చిదిద్దుకొను విద్య పెద్దలందించినారు. ఆ వశిష్ఠుడు జమదగ్ని ఆదిగా గల మహర్షుల వద్ద కామధేనువు లున్నట్లు పురాణములు తెలుపును. వారి వద్దగల కామధేనువు, ఒక ప్రత్యేకమైన గోవు కాదు. 

అది వారి ధేనుత్వమే, వారి తపశ్శక్తియే. తపశ్శక్తి ఒక లక్షణమైన గోవునందు వారు ప్రవేశింపచేసినప్పుడు ఆ గోవు కామధేను వగుచుండును. ఈ కామధేనుత్వము నందించునది శ్రీదేవియే. అమ్మ అనుగ్రహ వశమున అమాయకు డొకడు మహాకవి కాళిదాసువలె పరిణమించెను. 

వేదవ్యాసుడి తరువాత వేదవ్యాసుడంతటి వాడు కాళిదాస మహాకవియే. అమ్మ ఎంత ఆగ్రహించగలదో అంత అనుగ్రహించగలదు. ఆమె పాదములను హృదయమున భావించి పూజించు వారికి అమృతధారలు వర్షించు నవకాశము కలదు. మరణమును దాటుటకు, బ్రహ్మత్వమును పొందుటకు శ్రీదేవి పాదములు చాలును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 106 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Sudhāsārabhi-varṣiṇī सुधासारभि-वर्षिणी (106) 🌻*

There is one soma chakra in the middle of sahasrāra. When Kuṇḍalinī reaches this cakra, out of the heat generated by Her presence, the ambrosia which is stored there gets melted and drips through the throat and enters the entire nervous system.  

Soma cakra is discussed in nāma 240. Tantric interpretation of this ambrosia differs from this interpretation. Saundarya Laharī (verse 10) says, “You drench the nādi-s (nerves) in the body with the flood of nectar gushing through Your feet.”

{Further reading on ambrosia: The followers of samayācāra, (worshipping Her through the cakra-s of Kuṇḍalinī, beginning from mūlādhāra is called samayācāra. 

Please refer nāma 98) both the planet moon and cit-candra-mandalā (nāma 240) (cit means foundational consciousness) at sahasrāra represent Śrī Cakra as both have similar qualities. Both shed nectar. 

 Her lotus feet deemed to shine in the moon region of śrī Cakra. Moon is the master of all medicinal herbs that are said to ooze divine water known as nectar.}

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


23 Nov 2020

No comments:

Post a Comment