శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 42 / Sri Devi Mahatyam - Durga Saptasati - 42


🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 42 / Sri Devi Mahatyam - Durga Saptasati - 42 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 11

🌻. నారాయణీ స్తుతి - 6
🌻

48. ఓ సురలారా! నేనప్పుడు మళ్ళీ వర్షాలు కురిసే దాక, లోకమంతటిని నా శరీరం నుండి ఉత్పత్తి అయిన ప్రాణాలు నిలుపగల కాయగూరలతో పోషిస్తాను.

49. అప్పుడు నేను భూమిపై 'శాకంభరి' అనే పేర విఖ్యాతి చెందుతాను. అదే కాలంలో దుర్గముడు అనే మహారాక్షసుణ్ణి నేను వధిస్తాను.

50–52. అందుచేత నాకు దుర్గాదేవి అనే సుప్రసిద్ధ నామం కలుగుతుంది. మళ్ళీ హిమాలయ పర్వతంపై భయంకర రూపాన్ని దాల్చి మునిజన సంరక్షణార్థం నేను రాక్షసులను క్షయమొందిస్తాను.

అంతట మునులెల్లరూ భక్తితో శరీరాలను వంచి నన్ను స్తుతిస్తారు, అందుచేత నాకు 'భీమాదేవి' అనే విఖ్యాత నామం సిద్ధిస్తుంది.

53. అరుణుడు అనే రక్కసుడు ముల్లోకములకు మహాబాధ కలిగించినప్పుడు నేను లెక్కలేనన్ని భ్రమరము (తుమ్మెద)లతో కూడిన భ్రమరరూపాన్ని ధరించి ముల్లోకాల మేలు కొరకు ఆ మహాసురుణ్ణి వధిస్తాను.

54-55. అంతట లోకమంతా నన్ను 'భ్రామరి' అను పేర కీర్తిస్తారు. ఇలా రక్కసుల రాక వల్ల బాధ ఎప్పుడెప్పుడు కలుగుతాయో, అప్పుడెల్ల నేను అవతరించి శత్రువినాశం చేస్తాను.”

శ్రీ మార్కండేయపురాణమందలి సావర్ణిమన్వంతరంలో "దేవీ మాహాత్మ్యము" లోని "నారాయణీస్తుతి" అనే ఏకాదశాధ్యాయము సమాప్తం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 42 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 11

🌻 Hymn to Narayani - 6
🌻

48. 'At that time, O devas, I shall maintain the whole world with life -sustaining vegetables, born out of my own (cosmic) body, till rains set in.

49. 'I shall be famed on the earth then as Sakambhari. At that very period I shall slay the great asura named Durgama.

50-53. 'Thereby I shall have the celebrated name of Durgadevi and again, assuming a terrible form on the mountain Himalaya, I shall destroy the rakshasas for the protection of the munis.

Then all the munis, bowing their bodies reverently, shall praise me, and thereby I shall have the celebrated name of Bhimadevi.

When the (asura) named Aruna shall work great havoc in the three worlds, having taken a (collective) bee-form, consisting of innumerable bees, I shall slay the great asura for the good of the world.

54-55. 'And then people shall laud me every where as Bhramari. Thus whenever trouble arises due to the advent of the danavas, I shall incarnate and destroy the foes.'

Here ends the eleventh chapter called 'Hymn to Narayani' of Devi-mahatmya in Markandeya Purana, during the period of Savarni, the Manu.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


23 Nov 2020

No comments:

Post a Comment