భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కణ్వమహర్షి - 2 🌻
07. అందరికీ కలియుగంలో ఒకతే స్మృతి అనటానికి వీలులేదు. కొందరి అభిప్రాయంలో మనుస్మృతి కలియుగానికి వర్తించదు. శంఖలిఖితస్మృతి ద్వాపరయుగానికి వర్తిస్తుంది. భరద్వాజుడు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు ఇప్పుడుకూడా మనకు వర్తిస్తాయి.
08. కాబట్టి యుగానికి ఒక్కొక్క స్మృతి – అంటే ఆ శాఖీయులని వాడమని ఒక అర్థం ఉంది. ఏ శాఖలో మనం ఉన్నమో ఆ శాఖలో ఆ ఋషిచెప్పిన స్మృతినివాడతమే సమంజసం అని భావించాలి. యుగధర్మం అలా ఉంది.
09. సామాన్యంగా నాలుగువర్ణాలవారికీ, సమస్త ప్రజలందరికీ, స్త్రీలకు, పురుషులందరికీ వర్తించే విధంగా స్మృతి ఒకటి ఉండగా; ప్రత్యేకమయిన ఒక కుటుంబీకులు వాళ్ళశాఖకుచెందిన ఋషులు చెప్పిన స్మృతులను వాళ్ళు అనుసరించాలి. అది యోగ్యమైంటువంటి విధానమని మనం భావించవచ్చు.
10. అందరూ మనుస్మృతి-మనుస్మృతి అని అంటారు. నిజానికి మనుస్మృతి ఇంత ప్రధాన్యత సంఘంలో ఇటీవలే వచ్చింది. ఈ స్మృతులన్నీ ఆయా ప్రంతాలలో ఉండేవి. కాశ్మీరు లోనూ, పంజాబులోనూ భరద్వాజస్మృతి ఎక్కువగా ఉండేది.
11. ఉత్తభారతప్రాంతాలలో యాజ్ఞవల్కస్మృతికూడా ప్రచారంలో ఉంది. వళ్ళ వివాహాదులుకూడా దానిని బట్టే నడుస్తాయని అంటారు వాళ్ళు. పంజాబులో అక్కడివాళ్ళకు వారి స్మృతే ప్రధానం. అలాగే కాశ్మీరులో ఇంకొక స్మృతి. గుజరాతులో మరొకటి ఉంది.
12. బ్రాహ్మణులలోకూడా అనేక ఋషివంశాలలో, గోత్రాలలో, శాఖలలో అనేక వంసకర్తలు చెప్పిన వాక్యాలను ఆయా కుటుంబాలవారు, ప్రాంతాలవారు అనుసరిస్తూ వాళ్ళ కార్యక్రమాలను నడుపుకునేవాళ్ళు. ‘కలౌ పరాశరస్మృతిః’- అంటే, కలిలో పరాశరుడు స్మృతి సామాన్య వ్యవహారంలో ఉన్నదని అర్థం. యాజ్ఞవల్కుడు, పరాశరుల స్మృతులు సామాన్యంగా అనుసరిస్తూ వచ్చారు.
13. శంఖలిఖిత స్మృతి ఒకటి ఉంది. నీతి, న్యాయము, ధర్మము, తాను చేసిన నేరానికి తనను తానే శిక్షించుకోవడం అనేది మనుశ్మృతిలో లేదు; కాని శంఖలిఖితులు దీనిని తమ స్మృతిలో చెప్పారు. “ఇంకొకళ్ళు శిక్షించేదాక ఎందుకుండాలి? నిన్ను నీవే శ్ఖించుకో! స్వర్గం కనబడుతుంది. మోక్షం కలుగుతుంది నువ్వు పెద్దలవద్దకు వెళ్ళి అడుగు. శిక్ష పడకపోతే నువ్వే శిక్షించుకో! నీకు తెలుసు” అని శంఖలిఖిత స్మృతి చెబుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment