శ్రీ శివ మహా పురాణము - 589 / Sri Siva Maha Purana - 589


🌹 . శ్రీ శివ మహా పురాణము - 589 / Sri Siva Maha Purana - 589 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴

🌻. కార్తికేయుని లీలలు - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

అతని ఈ మాటను విని ఆ బాలుడు తన వృత్తాంతమును చెప్పెను. తరువాత గొప్పలీలలను ప్రదర్శించు ఆ బాలకుడు గాధి కుమారుడగు విశ్వామిత్రుని ఉద్దేశించి ప్రేమతో నిట్లు పలికెను (11).

శివకుమారుడిట్లు పలికెను-

విశ్వామిత్రా! నీవు నా వరముచే బ్రహ్మార్షివైనావు. సంశయించకుము. వసిష్ఠాది మునులు నిన్ను నిత్యము ఆదరముతో కొనియాడ గలరు (12). కావున, నీవు నా ఆజ్ఞచే సంస్కారమును చేయవలెను. ఈ విషయమునంతయునూ నీవు పరమరహస్యముగా నుంచుము. ఎచ్చటనైననూ చెప్పవద్దు (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ దేవర్షీ ! అపుడాయన ఆనందముతో ఆ శివసుతునకు వేదోక్త విధానముతో సంస్కారను చేసెను (14).

గొప్పలీలలను ప్రదర్శించే ప్రభువగు ఆ శివసుతుడు ఆనందించి విశ్వామిత్ర మహార్షికి శ్రేష్టమగు దివ్వజ్ఞానము నిచ్చెను(15). ద్విజశ్రేష్ఠుడు, నానా లీలా పండితుడు అగు ఆ అగ్ని పుత్రుడు ఆ నాటి నుండియూ విశ్వామీత్రుని పురోహితునిగా చేసుకొనేను (16).

ఓ మహర్షీ! ఆయన ప్రదర్శించిన ఈ లీలలను నీకు చెప్పితిని. కుమారా! ఆ బాలకుని మరియొక లీలలను చెప్పెదను. ప్రీతితో వినుము(17).

తరువాత ఆగ్ని అచటకు వెళ్లి ఆ బాలుని చూచి 'పుత్రా!' అనీ ఆలింగనము చేసుకొని ముద్దిడి శక్తి అనే ఆయుధమును అతనికి ఇచ్చేను (18). గుహుడు ఆ శక్తిని చేత బట్టి పర్వత శిఖరము నెక్కి ఆ శక్తితో కొట్టగా ఆ శిఖరము నేలగూలెను (19). పదికోట్ల వీరులగు రాక్షసులు ముందుగా అతనిని సంహరించిటకై వచ్చిరి. ఆ బాలకుడు శక్తితో కొట్టగా వారు వెంటనే నశించిరి (20). గొప్ప హాహాకారము చెలరేగెను. పర్వతములతో సహా భూమి కంపించెను. ముల్లోకములు వణికిపోయెను. అప్పుడు ఇంద్రుడు దేవతలతో గూడి అచటకు వచ్చెను (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 589 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴

🌻 The boyhood sports of Kārttikeya - 2 🌻


Brahmā said:—

11. On hearing his words the boy told him about his life. The divine boy, the cause of great enjoyment and protection, said to Gādhi’s son with great pleasure.


Śiva’s son said:—

12. O Viśvāmitra, thanks to my favour, you now become a brahminical sage. Vasiṣṭha and others will for ever regard you with respect.

13. Hence, at my behest you shall perform my purificatory rites. Keep this as a great secret. You shall not mention it anywhere.


Brahmā said:—

14. O celestial sage, in the manner laid down in the Vedas he performed the purificatory rites for the son of Śiva.

15. Śiva’s son, the cause of great enjoyment and protection, was glad and conferred divine wisdom on the sage.

16. The son of Agni made Viśvāmitra his priest. Form that time onwards he became a great brahmin and an expert in divine sports of various sorts.

17. O sage, the very first sport that he performed thus has been narrated to you by me. O dear, listen to another sport of his with wonder. I shall narrate it to you.

18-19. At that time he was known as white in colour. Agni went there and seeing his son who was divine and very holy called him “O dear son.” Agni embraced and kissed him too. He gave him a miraculous weapon, spear.

20 Guha took the spear and ascended the peak. He hit the peak with his spear and the peak fell down.

21. Ten thousand billions of heroic demons came there to attack him but were killed on being hit with the spear.


Continues....

🌹🌹🌹🌹🌹


04 Jul 2022

No comments:

Post a Comment