🌹 . శ్రీ శివ మహా పురాణము - 552 / Sri Siva Maha Purana - 552 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴
🌻. కామ సంజీవనము - 2 🌻
దేవీ మూర్తు లిట్లు పలికినారు -
నీకు భక్త వత్సలుడని పేరు. దీనులకు బంధువు నీవే. నీవుదయానిధివి. మన్మథుని బ్రతికించి రతికి ఉత్సాహమునిమ్ము. నీకు నమస్కారమగు గాక! (12)
బ్రహ్మ ఇట్లు పలికెను-
వారి ఈ మాటను విని కరుణా సముద్రుడగు మహేశ్వర ప్రభుడు ప్రసన్నుడై వెంటనే దయాదృష్టిని బరపెను (13). శూలపాణియగు శివుని అమృతదృష్టిచే భస్మ నుండి అదే రూపము వేషము చిహ్నములు గల అద్భుతమగు సుందరమైన దేహము గలవాడై మన్మథుడు బయటకు వచ్చెను (14). అదే రూపముతో చిరునవ్వుతో ధనుర్బాణములను ధరించి యున్న తన భర్తను చూచి రతి ఆతనికి, మహేశ్వరునకు ప్రణమిల్లెను (15). భర్త జీవుంచటచే కృతార్థురాలైన ఆమె ప్రాణనాథుని ఇచ్చిన శివ దేవుని చేతులు జోడించి అనేక పర్యాయములు స్తుతించెను (16). భార్యతో గూడి మన్మథుడు చేసిన స్తోత్రమును విని కరుణార్ద్రహృదయుడగు శంకరుడు మిక్కలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (17).
శంకరుడిట్లు పలికెను -
ఓయీ! మనస్సులో నీ అంతట నీవు పుట్టే మన్మథా! భార్యతో గూడి నీవు చేసిన స్తుతికి నేను ప్రసన్నుడనైతిని. నీకిష్టమగు వరమును కోరుకొనుము. నీకు ఇచ్చెదను (18).
బ్రహ్మ ఇట్లు పలికెను-
శంభుని ఈ మాటను విని మన్మథుడపుడు మహానందమును పొందినవాడై చేతులు జోడించి నమస్కరించి బొంగురుపోయిన కంఠముతో నిట్లనెను (19).
మన్మథుడిట్లు పలికెను-
దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వేశ్వరుడవగు నీవు ప్రసన్నుడవైనచో నాకు ఆనందమును కలిగించుము (20). ప్రభూ! పూర్వము నేను చేసిన అపరాధమును మన్నించుము. నీ భక్తుల యందు పరమప్రీతిని, నీ పాదములయందు భక్తిని ఇమ్ము (21).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మన్మథుని ఈ మాటను విని ప్రసన్నుడైన కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు నవ్వి ఆతనితో 'అటులనే' అని ఇట్లనెను (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 552 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴
🌻 The resuscitation of Kāma - 2 🌻
The celestial ladies said:—
12. Obeisance to you, O lord, you are known as favourably disposed to your devotees. You are friend of the distressed, storehouse of mercy. Resuscitate the cupid. Make Rati jubilant.
Brahmā said:—
13. On hearing their words, lord Śiva was delighted. The lord, the ocean of mercy, glanced compassionately.
14. Thanks to the nectarine glance of the Tridentbearing lord, Kāma came out of the ashes, a comely wonder-inspiring body with splendid dress and features.
15. On seeing her husband in the same form as before, wielding the bow and the arrows and smiling, Rati bowed to lord Śiva.
16. She became contented. With her husband resuscitated and with palms joined in reverence she eulogised the lord, the bestower of her husband, frequently.
17. On hearing the eulogy of Kāma and his wife, Śiva was delighted and he spoke with his heart melting with pity.
Śiva said:—
18. O Kāma, I am delighted by your eulogy in the company of your wife. O self-born, tell me the boon you desire. I shall grant it.
Brahmā said:—
19. On hearing these words of Śiva, Kāma was highly delighted. Humbly and in faltering accents he spoke with palms joined in reverence.
Kāma said:—
20. O lord of gods, O ocean of mercy, if you, the lord of all, are pleased with me please be delightful to me.
21. O lord, please forgive my fault formerly perpetrated by me. Please grant me great affection towards my people and devotion to your feet.
Brahmā said:—
22. On hearing the words of Kāma, lord Śiva was delighted. Giving consent, the lord of mercy laughingly said.
Continues....
🌹🌹🌹🌹🌹
20 Apr 2022
No comments:
Post a Comment