మైత్రేయ మహర్షి బోధనలు - 118
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 118 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 91. జీవుని అశ్రద్ధ -2🌻
మానవులకు మాత్రమే ఆలోచన, వివేచన, భాషణ యీయబడినవి. కాని వాని విలువ తెలియక అతడు ప్రవర్తించుచున్నాడు. శ్రద్ధ సహజ గుణము కాబడినది. కొన్ని విషయములపై శ్రద్ధ, మరికొన్ని విషయముల యందు అశ్రద్ధ గలవారు శ్రద్ధాళువులు కాలేరు.
శ్రద్ధ సహజగుణమైనచో అన్ని విషయము లందును అది భాసించగలదు. శ్రీరాముని జీవితము శ్రద్ధకు పరిపూర్ణ సంకేతము. శ్రద్ధ లేనివారు ఇపుడాధ్యాత్మిక బోధన కెగబడుట కలియుగ ప్రభావమే. వారు ఆచరణము నందు శ్రద్ధలేక, ప్రచారముననే శ్రద్ధ గలిగి యున్నారు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
14 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment