మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 4 🌻


మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు.

ఉదయం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు సాయంత్రం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు అనుష్ఠానం చేసికొంటూ ఉండండి. (అని నియమం) ఈ సంస్థ యువకులలోంచి బయలు దేరి ఇన్ని దేశాలలోను స్థాపింపబడినది.

ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, బెల్జియం, హాలండ్, స్విట్లర్లాండ్, వెస్ట్ జర్మనీ, స్కాండినేవియన్ దేశాలలో అనగా డెన్మార్క్ మొదలయిన దేశాలలో కూడా ఉన్నది. ఈ దేశాలన్నింటిలోను స్థానికమైన కాలమానం ప్రకారం ఉదయం, సాయంకాలం 6.00 గంటలకు ప్రార్థన చేసికొంటున్నారు.

ఈ ప్రార్థన చేసికొనేటప్పుడు కూర్చున్న తరువాత ముందు 'ఓంకారము' మూడు పర్యాయములు చేసి తరువాత గురుస్తోత్రం చేసికోవాలి.

తరువాత గాయత్రీ మంత్రం పదిమారులు సస్వరంగా కంఠమెత్తి ముక్తకంఠంగా ఉచ్చారణ చేసికొనవలసినది. అది అయిన తరువాత గురుశిష్య సంబంధాన్ని స్థాపించు "శంనో మిత్రః శంవరుణః" అను మంత్రమును ఉచ్చరించవలెను.

తరువాత జ్వాలాకూల మహర్షి యావత్ర్పపంచమునకు బ్రహ్మ విద్యా సమన్వయం చేయటం కోసం, ఒక సుప్రభాతం (Invocation) అనునది ఇచ్చారు. ఆ Invocation‌ ని ఉదయం పూట చేసికొనవలసినది. తరువాత నేను ఒక Invocation ఇచ్చాను. వీటిని ఇన్ని దేశాల వారు ఒక Standard క్రింద పెట్టుకున్నారు.

దీనిని అనుష్ఠానం చేసికొనునపుడు ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు.


.......✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


13 Oct 2021

No comments:

Post a Comment