నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 - 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం / DAILY WISDOM - 273 - 29. Nature, the First and Immediate Neighbour



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం 🌻


పౌర విధులలో పర్యావరణ పరిగణనలు మరియు ప్రకృతి యొక్క వాస్తవ రూపాన్ని, స్వచ్ఛతను రక్షించే బాధ్యత కూడా ఉన్నాయి. పర్వతాలు నిలబడనివ్వండి, నదులు ప్రవహించనివ్వండి, చెట్లు పెరగనివ్వండి, స్వచ్ఛమైన గాలి వీచనివ్వండి మరియు వారి స్వేచ్ఛ, తాజాదనం మరియు నిర్మలత్వం లో ఎవరూ అడ్డు పడకూడదు. పొగ మరియు ధూళితో గాలిని కలుషితం చేయడం, నీటిపై వ్యర్థాలు మరియు ధూళిని వేయడం ద్వారా నీటిని నాశనం చేయడం, తాము నిలబడి ఉన్న నేల యొక్క బలానికి కారణమై మరియు తగిన ఋతువులో వర్షపాతానికి కారణమయ్యే చెట్లను నాశనం చేయడం మనిషి యొక్క పౌర నేరాలు. బహిరంగ మైదానంలో చెత్త వేయటం ప్రకృతికి మరియు ప్రజల ఆరోగ్యానికి నిషిద్ధం.

ఒక వ్యక్తి తనలా భావించి ప్రేమించవలసిన మొదటి సహోదరి ప్రకృతి కాదా? జీవం తనలో తాను నిర్వహించుకునే ఆర్థిక సూత్రాల ద్వారా మనుగడ సాగిస్తుంది. జీవం అనేది తన లక్షణాలలో హెచ్చుతగ్గులు లేకుండా సామరస్యతతో కూడిన వ్యవస్థ. ఆర్థిక పరిస్థితులు అంటే కేవలం బంగారం మరియు వెండి, భూమి మరియు ఆస్తులతో ఆగిపోవు. అర్థసాస్త్రం అనేది జీవితం మరియు శక్తి యొక్క పరిరక్షణ యొక్క , అంతర్గత సమతుల్యత నిర్వహణ యొక్క సూత్రం. శరీరం తన యొక్క సాధారణ అవసరాలు పెరగటం మరియు తగ్గటం వల్ల ఏ విధంగా అనారోగ్యం పాలవుతుందో అదే విధంగా మనసు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ పనిచేయటం వల్ల తన శక్తిని కోల్పోతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 273 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 29. Nature, the First and Immediate Neighbour 🌻


Civic duties also include ecological considerations and the obligation to protect nature in its originality and purity. Let mountains stand, let rivers flow, let trees grow, let fresh air blow, and let no one interfere with their freedom, freshness and innocence. Polluting air with smoke and dust, vitiating water by dumping waste and dirt on it, destroying living trees which are responsible for the strength of the ground on which they stand and are also responsible for rainfall in the suitable season, are civic offences on the part of man. Throwing garbage on open ground is prohibitory to commonweal and health of people.

Is not nature the first and immediate neighbour whom one has to love as one's own self? Life survives by the principle of economy it maintains in itself. Life is a system of harmony without excess in any of its features. Economic conditions do not exhaust themselves merely in gold and silver, land and property. Economy is the principle of the conservation of life and energy, the proper maintenance of balance in its internally adjusted parts. As more than the normal or less than the normal needs of the body may turn it sick and make it droop in weakness, so can the mind lose its power and become ill by either excessive activity or inactivity.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

No comments:

Post a Comment