మైత్రేయ మహర్షి బోధనలు - 112


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 88. రుచికర బోధనము 🌻

మా బోధనలు సంప్రదాయక బోధనలకన్న భిన్నముగ నున్నవని చాల మంది భావింతురు. సృష్టి పరిణామ కథలో బోధనలు కూడ పరిణామము చెందుచున్నవి. కాలమును, దేశమును, ప్రజల సంస్కృతిని బట్టి బోధనలు అందించు విధానమున కొంత మార్పు జరుగుచుండును. బోధనల ఆశయము జీవులకు జ్ఞానాసక్తి కలిగించుటయే. ఆసక్తి కలుగవలెనన్నచో, బోధనలయందు కొంత ఆకర్షణ యుండవలెను. ఆకర్షితులైన జీవులు జ్ఞానమున ప్రవేశించుటకు వీలగును. జీవులను చైతన్య మార్గమున ముందునకు నడుపుటయే మా ఏకైక ఆశయము. ఆశయ నిర్వహణమునకై మా బృందము రకరకములగ బోధనలను చేయును.

బోధనల ముఖ్య ఉద్దేశ్యము, శ్రద్ధను కలిగించి జ్ఞానమున ప్రవేశపెట్టుట. ఆకలి తీర్చుటకై ఆహారము భుజించుట అవశ్యకము. ఆహారము పోషకాహారమై యుండవలెను. పోషణమునకు విరుద్ధము కాని రుచి భుజించువారికి ఆహారమునందాసక్తి కలిగించును. రుచికాకర్షింపబడి పోషకమగు ఆహారమును భుజించువాడు శరీర పుష్టినెట్లు పొందునో, అట్లే బోధనలు రుచికరము చేయవలెను. అనుసరించు వారికి రుచి కలుగవలెను. రుచి అనగా వెలుగు అని కూడ అర్థమున్నది. బోధనలయందు రుచి జ్ఞానముగ ఆవిర్భ వించును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

No comments:

Post a Comment