నిర్మల ధ్యానాలు - ఓషో - 173


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో, గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. 🍀


జీన్పాల్ సార్రేది విలువైన స్టేట్ మెంట్ వుంది. యితరమైన ప్రతిదీ నరకమే! దాదాపు ప్రపంచంలోని అందరి అభిప్రాయమదే. కేవలం కొందరు 'బుద్ధుల అభిప్రాయం మాత్రమే దానికి భిన్నమైంది. 'యితరమైన ప్రతిదీ నరకమే' నేను అతన్తో ఏకీభవించను. అది లక్షల మంది అనుభవం ఐనా కావచ్చు. అది కరక్టే అనిపిస్తుంది. కానీ కరెక్టు కాదు. అది కేవలం నువ్వు. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం.

స్వర్గం ఎక్కడో లేదు. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో. గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. యితరులు బాధ్యులయితే నీకు స్వేచ్చ వుండదు. నువ్వొక దాస్యంలో వున్నావు. అందువల్ల యితరులు నీకు సుఖదు:ఖాలు సృష్టిస్తున్నారను కుంటున్నావు. రెండు రకాలుగా నువ్వు ఆధారపడి వున్నావు. కానీ ఎవ్వరూ ఆధారపడి వుండాలనుకోరు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

No comments:

Post a Comment