శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 387 / Sri Lalitha Chaitanya Vijnanam - 387


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 387 / Sri Lalitha Chaitanya Vijnanam - 387🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : . ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀

🌻 387. 'షాడ్గుణ్య పరిపూరిత'🌻


ఆరు గుణములతో నిండినది శ్రీదేవి అని అర్థము. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, ధ్యానము, వైరాగ్యము అనునవి షడ్గుణములు. ఈ గుణములు గలవారు శ్రీమంతులు. కేవలము ధనము గలవారు శ్రీమంతులు గారు. శ్రీమాత పై గుణములను పరిపూర్ణముగ కలిగి యున్నది. ఆమెను ఆరాధించువారు పై గుణములను పొందుదురు. సద్భక్తి యున్నచోట పై గుణములు తప్పక యుండును. ధర్మ మాచరించు వారికి క్రమముగ మిగిలిన ఐదు గుణములు అబ్బగలవు.

పాండవులలో ధర్మరాజు, రఘువంశము నందు శ్రీరాముడు ఈ ఆరు గుణములకు పూర్ణమగు ఉదాహరణములు. హరిశ్చంద్రుడు, నలుడు కూడ అట్టివారే. దైవము, ధర్మము అనునవి నాణెమునకు బొమ్మ, బొరుసు వంటివి. ధర్మ మాచరించు వారికి దైవము చేరువ అగును. దైవము నారాధించు వారిని ధర్మ మాశ్రయించును. ధర్మముతో కూడని దైవారాధన డాంబికమై యుండును. ధర్మమాధారముగ మిగిలిన ఐదు గుణములు పొందవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 387 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻

🌻 387. ṣāḍguṇya-paripūritā षाड्गुण्य-परिपूरिता 🌻


She is endowed with six qualities that are considered auspicious. They are prosperity, righteousness, fame, material wealth, wisdom and dispassion. Dispassion because, She will not show any special favours to a select few, transcending the law of karma. She does not encourage favouritism.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Jul 2022

No comments:

Post a Comment