శ్రీ శివ మహా పురాణము - 596 / Sri Siva Maha Purana - 596


🌹 . శ్రీ శివ మహా పురాణము - 596 / Sri Siva Maha Purana - 596 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴

🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 5 🌻

కార్తికేయుడిట్లు పలికెను -

ఓ మంగళ మూర్తులారా ! భయమును విడనాడుడు. నేను ఉండగా భయమేల? తల్లులారా!: నేను ఆప శక్యము గాని బాలకుడను. నన్ను ఎవరు ఆపగలరు? (43)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇంతలో సేనాధి పతియగు నందీశ్వరుడు అచట కార్తికేయుని ఎదుట గూర్చుండి ఇట్లు పలికెను (44).

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ తల్లులారా! సోదరా! నా వృత్తాంతమును చెప్పెదను. వినుము. లయకర్త, మహేశ్వరుడు అగు శంకరుడు నన్ను పంపినాడు (45). కుమారా! బ్రహ్మ విష్ణు శివులు, సమస్త దేవతలు కైలాసమయునందు మహోత్సాహముతో మంగళకరమగు సందర్భములో సభను దీర్చి యున్నారు (46). అపుడు పార్వతి సభ యందు సర్వులకు శుభమును కలిగించే శంకరుని సంభోదించి నిన్ను వెతికించు మని చెప్పెను (47). అపుడు శివుడు దేవతలను నీ గురించి ప్రశ్నించగా, వారు ఒకరి తరువాత మరియొకరు సముచితమగు సమాధానముల నిచ్చిరి (48).

ధర్మా ధర్మములగు కర్మలకు సాక్షులుగా ఉండే ధర్ముడు మొదలగు వారందరు ఈశ్వరునితో నీవు కృత్తికల గృహములో ఇచట ఉన్నావని చెప్పిరి (49). పూర్వము పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో విహరించు చుండిరి. దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలింగించగా శివుని తేజస్సు భూమికి సంక్రమించెను (50).

భూమి అగ్ని యందు, అగ్ని కైలాస పర్వతమునందు, కైలాసుడు గంగయందు, గంగ తన తరంగముల వేగముచే రెల్లు గడ్డి వనమునందు నిక్షేపించిరి(51). అపుడు సమర్ధుడవగు నీవు దేవకార్యము కొరకై బాలుడవై జన్మించితివి. కృత్తికలు నిన్ను అచట కనుగొనిరి. ఇప్పుడు నీవు కైలాసమునకు వెళ్లుము (52).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 596 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴

🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 5 🌻



Kārttikeya said:—

43. O good women, O mothers, cast off your fear. When I am here what fear need you have? Although I am a boy I am invincible. Who can thwart me?

Brahmā said:—

44. In the meantime, Nandīśvara the commander-inchief sat in front of Kārttikeya and said.

Nandīśvara said:—

45. O brother, O mothers, listen to my auspicious mission. I have been commissioned by lord Śiva, the annihilator.

46. O dear, all the gods, Brahmā, Viṣṇu, Śiva and others are holding a jubilant conference at Kailāsa.

47. At that time Pārvatī addressed Śiva the benefactor of all, in that assembly urging a search for you.

48. Śiva asked the assembly severally about you in order to get you back. They too replied in a suitable manner.

49. They said to Śiva that you were here in the abode of Kṛttikas. Dharma and others who are the cosmic witnesses of all righteous and unrighteous activities revealed your whereabouts.

50. Formerly Pārvatī and Śiva indulged in their secret sexual dalliance. The semen of Śiva seen by the gods fell on the ground.

51. The earth dropped it into the fire, the fire on the mountain, the mountain in the Gaṅgā and the Gaṅgā transmitted it to the grove of Sara plants by her following currents and waves.

52. There you developed into a boy, the lord with the mission of fulfilling the task of the gods. There you were picked up by the Kṛttikas. Now you shall come down to the Earth.


Continues....

🌹🌹🌹🌹🌹


18 Jul 2022

No comments:

Post a Comment