దేవాపి మహర్షి బోధనలు - 91


🌹. దేవాపి మహర్షి బోధనలు - 91 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 72. ఆడంబరము - అధోగతి 🌻


త్రికరణ శుద్ధి లేని జీవనము కృత్రిమము. కృత్రిమ జీవనము అశాంతికి కారణము. లౌకిక జీవనమునకు గాని, అలౌకిక జీవనమునకు గాని త్రికరణశుద్ధి ముఖ్యము. కృత్రిమ జీవనము జీవుని రకరకములుగ బంధించును. తన నిజస్వభావమునకు విరుద్ధముగ మాటలాడువారు, పనులు చేయువారు ఆడంబరులు. లోపల స్వార్థబుద్ధి, వెలుపల ధర్మ ప్రవచనము, వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇట్టి డంబాచారులకు మాటలో సరళత యుండదు. చేతలో స్పష్టత యుండదు. ఆడంబరమునకు ఎక్కువ లొంగి ఉందురు.

ఇట్టివారు ఆధ్యాత్మిక మార్గమున పురోగతి చెందుట దుర్లభము. ఆడంబర జీవనమునకు మూలమున స్వార్థముండును. తనను, తనవి పెంపొందించుకొనుటకు ధర్మపన్నములు వల్లించుటయే కాని నిజముగ ధర్మానుష్ఠానబుద్ధి యుండదు. ధనకాంక్ష, కీర్తికాంక్ష కలిగి కామక్రోధముకులోనై, అసూయాగ్రస్తుడై అధోగతి పాలగును. డంబము ఆత్మశత్రువు. ఆత్మహంత.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 May 2021

No comments:

Post a Comment