శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 271 / Sri Lalitha Chaitanya Vijnanam - 271
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 271 / Sri Lalitha Chaitanya Vijnanam - 271 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀
🌻 271. 'ఈశ్వరీ' 🌻
సత్త్వగుణ ప్రధానమై సర్వస్వతంత్రయై సర్వ అధికారిణియై యుండునది శ్రీమాత అని అర్థము. ఈశ్వరుడనగా స్వామి, సర్వస్వతంత్రుడు. కర్తవ్యము, కర్తృత్వము లేనివాడు. ఇచ్ఛా, క్రియలు కూడ లేనివాడు. శుద్ధ సత్త్వమైన చైతన్యము. మాయచేత కూడ బంధింపబడనివాడు. జీవులకు శరణ్యమైన వాడు. దేవాసుర భావముల కతీతుడు. జగదీశ్వరి శ్రీమాత. ఆమెయందీ గుణము లన్నియూ ప్రస్ఫుటముగ గోచరించును.
జగదీశ్వరుని యందు కూడ ఈ గుణములు గోచరించును. సిద్ధులు, ఋషులు, యోగులు కోరునదీ స్థితియే. వ్యక్తిగత కర్మను దగ్ధము కావించుకొని సత్త్వగుణ ప్రధానులై నిత్య సత్యమందు నిలచి దివ్య ప్రణాళికయందు తమ కర్తవ్యమును స్వచ్ఛందముగా నిర్వర్తించువారు నిజమగు సిద్ధులు, యోగులు. ఇట్టి వారికి కర్తృత్వము లేదు. గనుక కర్మలేదు. కర్మబంధము లేదు గనుక స్వతంత్రులు. వీరి ఇచ్ఛా క్రియలన్నియూ దైవ ప్రేరితములే.
ఇట్టి వారిని కూడ ఈశ్వరులని (మాస్టర్స్) అని పిలుతురు. ఇట్టి యోగీశ్వరులకు, యోగేశ్వరియైన శ్రీమాతకు భేదమున్నది. అట్లే ఇట్టి యోగీశ్వరులకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణునకు (లేక శ్రీ మహావిష్ణువునకు) భేదమున్నది. యోగేశ్వరీ యోగేశ్వరుల అధీనమున మాయ ఉన్నది.
కానీ యోగీశ్వరులగు సిద్ధులు, యోగులు దైవ మాయకు బద్దులే. సనక సనందనాదులు, నారములు, త్రిమూర్తులు కూడ మాయనబడిన సందర్భము లున్నవి. ఇక ఇతరుల విషయము చెప్పనేల? మాయా స్వరూపమును దాటి యుండునది శుద్ధ చైతన్యమూర్తి యగు శ్రీదేవియే.
గోవిందుని రూపమున నున్నది కూడ ఆమెయే. మాయ వారి కనుసన్నలలో మెలగుచుండును. ప్రళయమందుకూడ మాయ విశ్రాంతి గొనుచు నుండునేగాని నశింపదని భాగవత పురాణము తెలుపుచున్నది. కావున ఈశ్వరీ ఈశ్వర పదములు త్రిగుణాతీత శుద్ద సత్త్వమునకు మాత్రమే ఆపాదింపదగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 271 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀
🌻 Īśvarī ईश्वरी (271)🌻
The one who does the act of tirodhāna explained in the previous nāma. Īśvara tattva is the 26th tattva (principle) out of the 36 tattva-s, where the power of knowledge is predominant.
Īśvara controls everything. Īśvara is parāhaṃtā, meaning Supreme individuality. Viṣṇu Sahasranāma nāma 36 is also Īśvara.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment