గీతోపనిషత్తు -321


🌹. గీతోపనిషత్తు -321 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-1 📚


🍀 24-1. తత్త్వదర్శనము - దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును. 🍀

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||

తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.

వివరణము : దైవారాధన పై శ్లోకములో తెలిపిన విధముగ ఒక నామమునకు, ఒక రూపమునకు పరిమితమైనపుడు తత్యానుభూతి యుండదు. దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది.

ఇతరులు మనలను చూచునపుడు వారిలో నుండి దైవమే మనలను చూచుచున్నాడు. అట్లే ఇతరులు భాషించు నపుడు వారి నుండి శబ్దమూలమగు నాదముగ తానే వినిపించు చున్నాడు. మనము పరిసరములను చూచునపుడు అందు యథార్థముగ దైవమే యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2022

No comments:

Post a Comment