2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 24-1 - 321- తత్వదర్శనము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 519🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -149🌹
5) 🌹 Osho Daily Meditations - 138🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 348 / Sri Lalitha Chaitanya Vijnanam - 348🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 13, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 6 🍀*
*🌟 6. వివస్వాన్ –*
*వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః |*
*అనుమ్లోచాః శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ*
*జగన్నిర్మాణకర్తారం సర్వదిగ్వ్యాప్తతేజసమ్ |*
*నభోగ్రహమహాదీపం వివస్వంతం నమామ్యహం*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : బ్రహ్మముతో కూడి యుండు ప్రయత్నము చేయు వానికి సులభముగ యోగము సిద్ధించును. 🍀*
*పండుగలు మరియు పర్వదినాలు :*
*కుంభ సంక్రాంతి, Kumbha Sankranti*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 18:43:22 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: ఆర్ద్ర 09:28:16 వరకు
తదుపరి పునర్వసు
యోగం: ప్రీతి 21:15:55 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ 18:39:22 వరకు
సూర్యోదయం: 06:43:43
సూర్యాస్తమయం: 18:16:55
వైదిక సూర్యోదయం: 06:47:21
వైదిక సూర్యాస్తమయం: 18:13:15
చంద్రోదయం: 15:23:56
చంద్రాస్తమయం: 04:11:05
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
వర్జ్యం: 22:40:30 - 24:26:10
దుర్ముహూర్తం: 16:44:30 - 17:30:43
రాహు కాలం: 16:50:16 - 18:16:55
గుళిక కాలం: 15:23:37 - 16:50:16
యమ గండం: 12:30:19 - 13:56:58
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: -
ధ్వాంక్ష యోగం - ధన నాశనం, కార్య
హాని 09:28:16 వరకు తదుపరి ధ్వజ
యోగం - కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -321 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-1 📚*
*🍀 24-1. తత్త్వదర్శనము - దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును. 🍀*
*24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |*
*న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||*
*తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.*
*వివరణము : దైవారాధన పై శ్లోకములో తెలిపిన విధముగ ఒక నామమునకు, ఒక రూపమునకు పరిమితమైనపుడు తత్యానుభూతి యుండదు. దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది.*
*ఇతరులు మనలను చూచునపుడు వారిలో నుండి దైవమే మనలను చూచుచున్నాడు. అట్లే ఇతరులు భాషించు నపుడు వారి నుండి శబ్దమూలమగు నాదముగ తానే వినిపించు చున్నాడు. మనము పరిసరములను చూచునపుడు అందు యథార్థముగ దైవమే యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 519 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 44
*🌻. మేన యొక్క మంకు పట్టు - 5 🌻*
మేన ఇట్లు పలికెను -
ఓ నాథా! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము. ఈ నీ కుమార్తె యగు పార్వతిని తీసుకు వెళ్లి కంఠము నందు బంధించి (48), శంకలేని వాడవై క్రిందకు త్రోసివేయుము. నేను ఆమెను శివునకు ఈయను. లేదా, ఓ నాథా! ఈమెను సముద్రములో ముంచి వేయుము. ఓ పర్వతరాజా! అపుడు నీకు సుఖము కలుగును. ఓ స్వామి! నీవు నీ పుత్రికను వికట రూపుడగు రుద్రునకిచ్చినచో నేను నిశ్చయముగా దేహత్యాగము చేసెదను (49, 50).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడచట మేన మొండి పట్టుదలతో ఇట్లు పలుకగా, పార్వతి స్వయముగా వచ్చి రమ్యముగా నిట్లు పలికెను (51).
పార్వతి ఇట్లు పలికెను -
తల్లీ! నీకు అశుభములను కలిగించే విపరీత బుద్ధి పుట్టినది. ధర్మమును అవలంబించిన నీవు ఇపుడు ధర్మము నేల వీడుచున్నావు? (52) ఈ రుద్రుడే పరమాత్మ యనియు, సర్వకారణుడగు ఈశ్వరుడేననియు, సుఖమును ఇచ్చువాడనియు, అందమైన రూపము గలవాడనియు వేదములన్నియు వర్ణించుచున్నవి. (53).
అమ్మా | ఈ శంకరుడు మహేశ్వరుడు, సర్వదేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించు వాడు, విష్ణు బ్రహ్మాడులచే సేవింపబడువాడు (54), సర్వప్రాణులకు అధిష్ఠానము, జగత్తును సృష్టించి సంహరించు ప్రభుడు, వికారములులేనివాడు, బ్రహ్మవిష్ణు రుద్రులను త్రిమూర్తులకు ప్రభువు, వినాశము లేనివాడు, సనాతనుడు (55). ఆయనకొరకై దేవతలందరు విచ్చేసి కింకరుల వలె ఈనాడు నీ ద్వారము వద్ద ఉత్సవమును చేయుచున్నారు. ఇంతకంటె గొప్ప సుఖమేమి గలదు? (56) కావున నీవు జాగ్రత్తగా లెమ్ము. నీ జీవితమును సార్థకమును చేసుకొనుము. నన్నీ శివునకు ఇచ్చి నీ గృహస్థాశ్రమమును సఫలము చేసుకొనుము (57).
అమ్మా! నన్ను పరమేశ్వరుడగు శంకరునకు ఇమ్ము. తల్లీ! నేను వినయముతో చెప్పు ఈ మాటను నీవు అంగీకరించుము (58). నీవు నన్ను శివునకు ఈయక పోయినచో నేను మరియొక వరుని వివాహమాడను. ఇతరులను వంచించి జీవించు నక్క సింహమునకు ఉద్దేశించిన భాగమును ఎట్లు పొందగల్గును? (59) తల్లీ! నేను మనోవాక్కాయ కర్మలచే శివుని వరించితిని. ఇది నిశ్చితము. నీకు నచ్చిన తీరున నీవాచరింపుము (60).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
🌻. మానవజన్మము - విశిష్టత -2 🌻*
*ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైన ఉపకరణాలు మనకి ఇవ్వబడినవని తెలుసుకోవాలి. వీటిని సద్వనియోగపరచి ఇతర జీవుల యందు తనకు గల కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం మానవుని ప్రధాన లక్ష్యం. కేవలం తన మేధాశక్తిని మాత్రమే ఆశ్రయించి తద్వారా ఇతర జీవులను తన వశంలో పెట్టుకునే ప్రయత్నం రాక్షసత్వమే అవుతుంది. మానవ జన్మము చక్కని శిక్షణ శిబిరము.*
*మొదట తన కుటుంబ సభ్యులతో మొదలై క్రమంగా వ్యాప్తి చెంది సామాజిక జీవనంలోకి ప్రవేశించి అనేక సన్నివేశముల రూపంలో ప్రకృతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు మానవుడు. అటుపైన తన కోసం తాను జీవించడమే కాకుండా లోకహితం కోరి పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే వ్యక్తిగతమనే బంధం నుంచి విముక్తుడవుతాడు. అప్పుడు అప్రయత్నంగానే లోకహితం కోసం పనిచేయగలిగే సామర్థ్యం ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగ అయినప్పుడే మానవుడు ఉత్తమ మానవుడుగా ఆవిర్భవిస్తాడు....*
...✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 138 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 138. BECOME POETIC 🍀*
*🕉 A poet comes to know certain things that are revealed only in a poetic relationship with reality. 🕉*
*The poet is foolish as far as worldly cleverness is concerned. He will never rise in the world of wealth and power. But in his poverty he knows a different kind of richness in life that nobody else knows. Love is possible to a poet, and God is possible to a poet. Only one who is innocent enough to enjoy the small things of life can understand that God exists, because God exists in the small things of life: he exists in the food you eat, he exists in the walk that you go for in the morning. God exists in the love that you have for your beloved, in the friendship that you have with somebody.*
*God does not exist in the churches; churches are not part of poetry, they are part of politics. Become more and more poetic. It takes guts to be poetic; one needs to be courageous enough to be called a fool by the world, but only then can one be poetic. And by being poetic I don't mean that you have to write poetry. Writing poetry is only a small, nonessential part of being poetic. One may be a poet and never write a single line of poetry, and one may write thousands of poems and still not be a poet. Being a poet is a way of life. It is love for life, it is reverence for life, it is a heart-to-heart relationship with life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 348 / Sri Lalitha Chaitanya Vijnanam - 348 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*
*🌻 348. 'వంద్యా ' 🌻*
*నమస్కరింపదగినది శ్రీమాత అని అర్థము. ఈ నామమునకు వ్యాఖ్యానము అవసరము లేదు. త్రిమూర్తులు సహితము శ్రీమాతకే నమస్కరింతురు. ఆమె నుండియే ప్రేరణ చెంది వారి వారి కార్యములను నిర్వర్తింతురు. ఇక ఇతరుల సంగతి చెప్పనేల? ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు సరిగ నిర్వర్తింపబడుటకు శ్రీమాతకు నమస్కరించ వలసినదే.*
*ఆమెకు నమస్కరించి ప్రేరణను పొంది ఆ ప్రేరణను నిర్వర్తించుటకు వలసిన జ్ఞానమును అమ్మనుండియే పొంది, ఆమె అందించు శక్తిచే నిర్వర్తించుట, అటుపైన అంతయూ ఆమెకే సమర్పించుట భక్తులు చేయు కార్యము. ఆమెను తిరస్కరించినవారికి సృష్టి యందు తిప్పలు తప్పవు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 348 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*
*🌻 348. Vandyā वन्द्या (348) 🌻*
*She is adorable. We adore someone by merely seeing him and without even knowing him. This happens because he draws divine energy from the cosmos and this gets reflected through his body as vibrations. Such vibrations are normally drawn through an orifice in the crown cakra and also through medulla oblongata which is situated beneath the back of our head.
*The third eye, the pineal gland and the back head cakra are placed in a straight line. When one is able to look within through the ājñā cakra, the energy generated passes through the pineal gland and gets released through the back head cakra and in the process cleanses bio-plasma body. This process not only accelerates one’s spiritual progress but also rarely confers some super human powers (siddhi-s).*
*She is the embodiment of all the energies of the universe. She draws Her energy from the Supreme Śiva and transmits to the universe for its sustenance. *
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment