నిర్మల ధ్యానాలు - ఓషో - 110


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 110 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం చేసేటపుడు ఫలితం గురించి పట్టించుకోకు. ఎదురు చూడకు. అది దాని సమయంలో వస్తుంది. నమ్ము! ధ్యానం ధ్యానం కోసమని ఆనందించు. ఎట్లాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు. ధ్యానానికి ముఖ్యంగా వుండాల్సిన సహజ లక్షణం సహనం. తొందర పడకూడదు. అప్పుడు హఠాత్తుగా అద్భుతం జరుగుతుంది. 🍀

ధ్యానంలో ప్రవేశించడానికి ముఖ్యంగా వుండాల్సిన సహజ లక్షణం సహనం. తొందర పడకూడదు. తొందరపడే కొద్దీ మరింత దూరమవుతుంది. శాశ్వతంగా ఎదురు చూడ్డానికి మనిషి సిద్ధపడాలి. ప్రేమతో, నమ్మకంతో ఎదురు చూడాలి హఠాత్తుగా జరగవచ్చు. నువ్వు ఎంత సహనంతో, ఓర్పుతో వున్నావన్న దానిమీద అది ఆధారపడి వుంటుంది. ఐతే ఒక విషయం గుర్తుంచుకో. ధ్యానం చేసేటపుడు ఫలితం గురించి పట్టించుకోకు. ఎదురుచూడకు. అది దాని సమయంలో వస్తుంది. నమ్ము! ధ్యానం ధ్యానం కోసమని ఆనందించు. దాన్ని గురించి అసూయపడకు. ఎట్లాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు. ధ్యానాన్ని ఆరంభంగా చూడకు. అంతంగా చూడు. అప్పుడు హఠాత్తుగా అద్భుతం జరుగుతుంది. అది నీ సమస్త అస్తిత్వాన్ని మారుస్తుంది.

పరివర్తన అన్నది సులభం. సహనంగా వుండడమన్న కళను వ్యక్తి తెలుసుకోవాలి. మానవజాతి మరచిపోయిన విషయమదే. ప్రతి ఒక్కరూ పనులు త్వరత్వరగా కావాలని చూస్తారు. నిజానికి ఎవరూ ఎదురుచూడరు. అందుకనే అన్ని మతాల్లో ఈ క్షణ ప్రయోజనాలకి సంబంధించి దురభిప్రాయాలేర్పడ్డాయి. మోసగించడాలు ఎక్కువయ్యాయి. నేను సహనాన్ని బోధిస్తాను. కేవలం సహనంగా వుండమంటాను. అప్పుడు నిజంగా అనుకున్నది జరుగుతుంది. అదే పారడాక్స్! సత్యానికి సంబంధించిన ఏదైనా విరోధాభాసమే. ఎందుకంటే సత్యం తన వ్యతిరేకతని కూడా తనలో కలుపుకుంటుంది!

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2021

No comments:

Post a Comment