17-JULY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 228 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 429🌹 
3) 🌹 వివేక చూడామణి - 104 / Viveka Chudamani - 104🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -56🌹  
5) 🌹 Osho Daily Meditations - 45🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 105 / Lalitha Sahasra Namavali - 105🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 105 / Sri Vishnu Sahasranama - 105🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -228 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 12 - 2

*🍀 11-2. యోగస్థితులు - అవసరార్ధమే ఇంద్రియము లందు ప్రవేశించుట, ఇతర సమయములలో హృదయము నందుండుట అభ్యాసమగుట నిజమగు సిద్ధి. అట్లున్న వానికి ఇంద్రియ ద్వారములు సంయమింపబడి యుండును. మనసు హృదయమున నియమింపబడి యుండును. దీనినే ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము అందురు. హృదయమున నిబద్ధమైన ప్రజ్ఞ ప్రాణస్పందనముతో ముడి పడినచో ప్రజ్ఞ - ప్రాణములు ఊర్ధ్వగతి చెందుచు, శిరస్సు నందలి భ్రూమధ్యమును చేరును. 🍀*

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్త్న్యైధా యాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ 12

తాత్పర్యము : 
సర్వద్వారములను సంయమము గావించి, మనస్సును హృదయమున చేర్చి, స్థాపించి, మనోప్రాణములను శిరస్సునకు చేర్చుము.

వివరణము : 
ఇట్లభ్యసించుట వలన విచక్షణా రహితముగ ఇంద్రియార్థముల వెంట, ఇంద్రియముల ద్వారా పరువెత్తుట అరికట్టబడును. ఇంద్రియములు ఎన్ని ఇంద్రి యార్ధములను గోచరింపజేయు చున్నను, అవసరము లేనపుడు ప్రజ్ఞ ఇంద్రియములందు ప్రవేశింపదు. అవసరార్ధమే ఇంద్రియము లందు ప్రవేశించుట, ఇతర సమయములలో హృదయము నందుండుట అభ్యాసమగుట నిజమగు సిద్ధి. అట్లున్న వానికి ఇంద్రియ ద్వారములు సంయమింపబడి యుండును. 

మనసు హృదయమున నియమింపబడి యుండును. దీనినే ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము అందురు. హృదయమున నిబద్ధమైన ప్రజ్ఞ ప్రాణస్పందనముతో ముడి పడినచో ప్రజ్ఞ - ప్రాణములు ఊర్ధ్వగతి చెందుచు, శిరస్సు నందలి భ్రూమధ్యమును చేరును. దీని వివరణము పదవ శ్లోకమున విస్తారముగ తెలుపబడినది. భ్రూమధ్యమున ప్రాణముతో కూడి ప్రజ్ఞ స్థిరపడుటను యోగమున ధారణమని తెలుపుదురు. 

ఇట్టి ధారణ స్థితియందుండుట వలన బ్రహ్మమును చేరు మార్గము సగము సిద్ధించినట్లగును. ఈ శ్లోకమున ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ అను యోగస్థితులను భగవానుడు సూచించినాడు. రాబోవు శ్లోకమున బ్రహ్మపథము చేరుటకు మిగిలిన మార్గమును బోధించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 428🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 25

*🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 5 🌻*

ఆ ముని ఎవనికి వినుటకు రుచించే తన విద్యను వినిపించునో, వాడు తప్పని సరిగా తన ఇంటిని వీడి వెంటనే భిక్షాటనను మొదలిడును (41). నారదుని దేహము సదా ప్రకాశించునదే. కాని అతని మనస్సు మలినము. అతనితో కలిసి నివసించే మాకు అతని గురించి పూర్తిగా తెలియును (42). 

కొంగ సాధువు అని కొందరు చెప్పెదరు. కొంగ అన్ని వేళలా చేపలను తినదు గదా! సహవాసుల చరిత్ర సహవాసులకుమాత్రమే తెలియును కదా! (43) నీవు బుద్ధి మంతురాలవే అయిననూ అతని ఉపదేశమును పొంది మూర్ఖురాలవై వ్యర్థముగా కఠినమగు తపస్సును చేయుచున్నావు.'44). 

అమ్మాయీ! నీవు ఎవని కొరకై ఇంత విస్తారమగు తపస్సును చేయుచున్నావో ఆ శివుడు సర్వదా ఉదాసీనుడై ఉండును. అయన నిర్వికారుడు, మన్మధ శత్రువు అనుటలో సందేహము లేదు.(45)

శూలధారియగు శివుడు అమంగళమగు శరీరము కలిగి సిగ్గులేని వాడై యుండును. ఆయనకు ఇల్లు లేదు. కులము లేదు. ఆయన దిగంబరుడై చెడు వేషమును కలిగి ప్రేతపిశాచాదులతో స్నేహమును చేయును (46). ఆ మోసగాడు తన మాయచే నీ బుద్ధిని చెడగొట్టి నిన్ను అనేక గొప్ప యుక్తులతో మోహింప జేసి నీచే తపస్సును చేయించుచున్నాడు (47). ఇట్టి వానిని వివాహమాడిన స్త్రీకి ఏమి సుఖము కలుగును? ఓ దేవదేవి! పార్వతీ నీవే ఆలోచించుము(48). ఆ మూర్ఖుడు ముందుగా దక్షపుత్రి, పతి వ్రతయగు సతిని వివాహమాడి సద్భుద్ధితో కొద్దిరోజులైననూ సరిగా కాపురము చేసినాడు కాదు(49). 

ఆ ప్రభువు ఆమె యందు స్వయముగా దోషమును చూపి పరిత్యజించినాడు. ఆయన నిరవయవము, శోకరహితమునగు ఆత్మ తత్త్వమును ధ్యానిస్తూ సుఖముగా రమించుచున్నాడు(50). ఆయన ఏకాకి, పరమమోక్ష స్వరూపుడు, సంగరహితుడు, ఆద్వితీయుడు, ఓ దేవీ! ఒక యువతి అతనితో ఎట్లు వేగ గలదు? అది సంభవము కాదు (51). ఈనాటికైననూ మా ఆజ్ఞను మన్నించి చెడు బుద్ధిని వీడి ఇంటికి వెళ్లుము. ఓ పుణ్యత్మురాలా! నీకు శుభము కలుగగలదు.(52)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 104 / Viveka Chudamani - 104🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 23. ఆత్మ స్థితిని చేరుట - 5 🍀*

351. మన యొక్క ఉన్నతమైన ఆత్మ ఎల్లపుడు విడదీయుటకు వీలులేని ఏకైక విజ్ఞానము. రెండవది లేనిది. బుద్ధి దర్శించే వివిధ వస్తు సముదాయాలన్ని స్థూల, సూక్ష్మమైన భావము ‘నేను’ అనే శాశ్వతమైన అంతర్గత ఆనందాన్ని ఇచ్చే ఉన్నతమైన ఆత్మయే. 

352. జ్ఞాని సత్యా సత్యములను విభజించి సత్యాన్ని ఆత్మ అనాత్మల ఏకత్వాన్ని గ్రహించి అంతర్‌ దృష్టితో సత్యాన్ని గ్రహించి, తన ఆత్మను తెలుసుకొని అది ఉన్నత జ్ఞానమని తనకు ఉన్న అడ్డంకులను తొలగించుకొని నేరుగా శాంతిని పొందును.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 104 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 23. Reaching Soul State - 5 🌻*

351. The Supreme Self is ever of the nature of eternal, indivisible knowledge, one without a second, the Witness of the Buddhi and the rest, distinct from the gross and subtle, the implied meaning of the term and idea "I", the embodiment of inward, eternal bliss.

352. The wise man, discriminating thus the real and the unreal, ascertaining the Truth through his illuminative insight, and realising his own Self which is Knowledge Absolute, gets rid of the obstructions and directly attains Peace.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 56 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. జీవుడనగా కేవల ప్రజ్ఞ 🌻*

స్వభావమును, కర్మఫలమును కాలవశమున అనుభవించువాడు జీవుడు. జీవుడనగా కేవల ప్రజ్ఞ.  

ఈ జీవుడు వాసుదేవుడేయని గుర్తుంచు కొనవలెను. వాసుదేవుడు కానిదేదియును లేదనుట సత్యము. కాలము , కర్మము , ఫలము, స్వభావము వాసుదేవుని క్రీడావస్తువులు.  

అతడు అంతర్యామియై వానితో ఆడుకొనుచు, జీవుడై వాని యందు జీవించును.

భాగవతము 2-84
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 45 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 HOME 🍀*

*🕉 Unless we find our real home we have to go on traveling, we have to go on journeying. And the most surprising thing is that the real home is not jar away. 🕉*

We make many homes, and we never look at the real home. The homes that we make are all arbitrary; they are sandcastles or palaces made of playing cards: just toys to play with. They are not real homes, because death destroys them all. The definition of the real home is that which is eternal. Only God is eternal; everything else is temporary. 

The body is temporary, the mind is temporary; money, power, prestige-all are temporary. Don't make your home in these things. I am not against these things. Use them, but remember that they are just a caravansary; they are good for an overnight stay, but in the morning we have to go. 

We go on missing our real home because it is very close; it is not even close, it is within ourselves. Search for it within. Those that have gone in have always found it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 105 / Sri Lalita Sahasranamavali - Meaning - 105 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*
*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*

🍀 509. మేదోనిష్ఠా - 
మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.

🍀 510. మధుప్రీతా - 
మధువులో ప్రీతి కలిగినది.

🍀 511. బందిన్యాది సమన్వితా - 
బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది.

🍀 512. దధ్యన్నాసక్త హృదయా - 
పెరుగు అన్నం ఇష్టపడునది.

🍀 513. కాకినీ రూపధారిణీ - 
కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 105 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 105. medoniṣṭhā madhuprītā bandhinyādi-samanvitā |*
*dadhyannāsakta-hṛdayā kākinī-rūpa-dhāriṇī || 105 || 🌻*

🌻 509 ) Medho nishta -   
She who is in the fatty layer

🌻 510 ) Madhu preetha -   
She who likes honey

🌻 511 ) Bhandinyadhi samanvidha -   
She who is surrounded by Shakthis called Bandhini

🌻 512 ) Dhadyanna saktha hridhaya -   
She who likes curd rice

🌻 513 ) Kakini roopa dharini -   
She who resembles “Kakini”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 105 / Sri Vishnu Sahasra Namavali - 105 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*రేవతి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 105. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|*
*యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ|| 105 ‖ 🍀*
 
🍀 976) యజ్ఞభృత్ - 
యజ్ఞములను సంరక్షించువాడు.

🍀 977) యజ్ఞకృత్ - 
యజ్ఞములను నిర్వహించువాడు.

🍀 978) యజ్ఞీ - 
యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.

🍀 979) యజ్ఞభుక్ - 
యజ్ఞఫలమును అనుభవించువాడు.

🍀 980) యజ్ఞసాధన: - 
తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.

🍀 981) యజ్ఞాంతకృత్ - 
యజ్ఞఫలము నిచ్చువాడు.

🍀 982) యజ్ఞగుహ్యమ్ - 
గోప్యమైన యజ్ఞము తానైనవాడు.

🍀 983) అన్నం - 
ఆహారము తానైనవాడు.

🍀 984) అన్నాద: - 
అన్నము భక్షించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 105 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Revathi 1st Padam* 

🌻 105. yajñabhṛdyajñakṛdyajñī yajñabhugyajñasādhanaḥ |
yajñāntakṛdyajñaguhyamannamannāda eva ca || 105 ||

 🌻 976. Yajñabhṛd: 
He is so called, because He is the protector and supporter of all Yajna.

🌻 977. Yajñakṛd: 
One who performs Yajna at the beginnig and end of the world.

🌻 978. Yajñi: 
One who is the Principal.

🌻 979. Yajñabhug: 
One who is the enjoyer of Yajna or Protector of Yajna.

🌻 980. Yajña-sādhanaḥ: 
One to whom the Yagya is the approach.

🌻 981. Yajñāntakṛd: 
One who is the end or the fruits of Yajna.

🌻 982. Yayajñaguhyam: 
The Gyana Yajna or the sacrifice of knowledge, which is the esoteric (Guhyam) of all the Yajnams.

🌻 983. Annam: 
That which is eaten by living beings. Or He who eats all beings.

🌻 984. Annādaḥ: 
One who is the eater of the whole world as food. The word Eva is added to show that He is also Anna, the food eaten.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment