శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 291 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 291 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 291 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 291 - 1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀

🌻 291-1.'పురుషార్థప్రదా' 🌻


పురుషార్ధములను ప్రసాదించునది శ్రీదేవి అని అర్థము. పురుషార్థములు చతుర్విధములు. కామము, అర్థము, ధర్మము, మోక్షము. ఈ నాలుగింటిని పరిపూర్తి గావించి జీవులను పరిపూర్ణులను చేయుటయే శ్రీమాత పని.

అర్థ కామములు, జీవులకు వారిలోని లోటు, అసంపూర్ణతల వలన కలుగును. రకరకములగు కోరికలు కలుగుటకు కారణము వానిని గూర్చిన పూర్ణానుభవము లేకపోవుటయే. అనుభవైకమైన విద్య నిజమైన విద్య. అనుభవములోనికి రాని విద్య తృప్తి నివ్వదు. జీవులకు తగుమాత్రము అనుభవ మందించుటకే జన్మ పరంపరలు. అనుభవము ద్వారా జీవునికి తప్పు ఒప్పులు తెలియును. అట్లే తృప్తినిచ్చువాటిలో తాత్కాలికము లేవి? శాశ్వతము లేవి కూడ తెలియును.

అసంతృప్తితో ముందుకు సాగుట వలన ప్రయోజనము లేదు. కావుననే జీవులకు లక్షలాది నరజన్మ లేర్పాటు చేయబడినవి. జీవులు అనుభవము చెందుచు పరిణామము దిశగ నడుచు చుందురు.

క్రమముగ కామమును, అర్థమును, ధర్మము అధ్యక్షతన నిర్వర్తించుకొనుట నేర్తురు. ధర్మమున చేరుట పరిపూర్తి యగుచున్నకొలది మోక్షము దగ్గరగు చుండును. కర్మబంధము లేకుండుటయే మోక్షము- అది ధర్మాచరణముననే సిద్ధించును. మానవ సంఘమున ఈ నాలుగు తరగతుల వారును ఉందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 291 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀

🌻 Puruṣārtha-pradā पुरुषार्थ-प्रदा (291) 🌻


Puruṣārtha is the fourfold values of human life. They are dharma (righteousness or virtues), artha (wish or purpose), kāma (desires and pleasures) and mokṣa (the liberation). It is clear that the ancient scriptures do not prohibit these great human values. What they say is not to get attached to them. On many occasions this concept is misquoted. She is the giver of this puruṣārtha.

There is another interpretation. Puruṣā means Śiva (Śaktī is prakṛti), artha means salvation and prada means giver. Śiva gives salvation through Śaktī. The importance of Śaktī is emphasized or probably the interdependence of Śiva and Śaktī is cited through this nāma.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


16 Jul 2021

No comments:

Post a Comment