నిర్మల ధ్యానాలు - ఓషో - 46
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 46 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం నిరంతరం యథార్థంతో సంబంధం కలిగి వున్నాం. మనం వేరు కాము. 🍀
అహం మనల్ని అస్తిత్వం నించీ వేరయిన వాళ్ళుగా భావిస్తుంది. మనల్ని ద్వీపాలని చేస్తుంది. అది తప్పు. మనం వేరుగా లేం. క్షణకాలం కూడా ఈ అనంత అస్తిత్వం నించీ వేరయి లేము. మన శ్వాస మనల్ని బాహ్యంతో బంధిస్తోంది. మనం నాసికతోనే కాదు. మన శరీరాణువులన్నిటితో శ్వాసిస్తున్నాం. మనకు దాహమేస్తుంది. నీళ్ళు తాగుతాం. దాహం తీరుతుంది.
ప్రతిదీ బాహ్యం నించీ లోపలికి, లోపలి నించీ బాహ్యానికి సంబంధం ఏర్పరుచుకుంటూ వుంటుంది. నిరంతరం ఆహారం వినిమయం జరుగుతుంది. నిరంతరం శ్వాస కొనసాగుతుంది. మనం నిరంతరం యథార్థంతో సంబంధం కలిగి వున్నాం. మనం వేరు కాము. వేయిన్కొక్క మార్గాల గుండా బాహ్యంతో మనకు బంధముంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
16 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment