విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 491 / Vishnu Sahasranama Contemplation - 491


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 491 / Vishnu Sahasranama Contemplation - 491🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 491. మహాదేవః, महादेवः, Mahādevaḥ 🌻

ఓం మహాదేవాయ నమః | ॐ महादेवाय नमः | OM Mahādevāya namaḥ

మహాదేవః, महादेवः, Mahādevaḥ

యన్మహత్యాత్మజ్ఞానయోగైశ్వర్యే యో మహీయతే ।
సర్వన్భావాన్పరిత్యజ్య స మహాదేవ ఉచ్యతే ॥

సంభవములగు సర్వభావములను వదలి మిగుల గొప్పదియగు ఆత్మజ్ఞానయోగమునకు ఈశ్వరుడుగానుండుట అను స్థితియందు పూజింపబడుచుండునుగావున 'మహాన్‍' అనబడును. మహాన్ అగు దేవుడు కావున శ్రీ మహా విష్ణువు 'మహాదేవః' అనబడుచున్నాడు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::

సీ.భూతాత్మా! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవు; బంధమోక్షములకుఁ బ్రభుఁడ నీవ;యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు;సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మవిష్ణు శివాఖ్య బరఁగు దీవు;ఆ.పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త, మంబు నీవ; శక్తి మయుఁడ వీవశబ్ద యోని వీవ; జగదంతరాత్మవు నీవ, ప్రాణ మరయ నిఖిలమునకు. (222)

నీవు పంచభూతాలకూ ఆత్మయైనవాడవు. భూతనాథుడవు. జీవులకు కారణరూపమైన దేవుడవు. దేవదేవా! మహాదేవా! దేవవంద్యా! అన్ని లోకాలనూ పాలించేవాడవు నీవు. లోకములోని బంధ మోక్షాలకు ప్రభుడవు నీవు. దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికీ స్థితికీ లయానికీ కర్తవు నీవు. బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేరులతో ప్రకాశిమ్చే వాడవు నీవే. భావింపరాని పరమాత్మవు నీవు. ప్రకృతి పురుష సవరూప్డవు నీవే. శక్తియుతుడవు నీవే. శబ్దానికి జన్మస్థానం నీవే. లోకానికి అంతరాత్మవు నీవే. సమస్తానికీ ప్రాణం నీవే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 491 🌹

📚. Prasad Bharadwaj

🌻 491. Mahādevaḥ 🌻


OM Mahādevāya namaḥ

यन्महत्यात्मज्ञानयोगैश्वर्ये यो महीयते ।
सर्वन्भावान्परित्यज्य स महादेव उच्यते ॥

Yanmahatyātmajñānayogaiśvarye yo mahīyate,
Sarvanbhāvānparityajya sa mahādeva ucyate.

Abandoning all possible concepts, He glories in the great wealth of ātmajñāna or self-realization, yoga and aiśvarya. Therefore, Lord Mahā Viṣṇu is called Mahādevaḥ.


:: श्रीमद्भागवते दशमस्कन्धे द्विषष्टितमोऽद्यायः ::

नमस्ये त्वां महादेव लोकानां गुरुमीश्वरम् ।
पुंसामपूर्णकामानां कामपूरामराङ्घ्रिपम् ॥ ७ ॥


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 62

Namasye tvāṃ mahādeva lokānāṃ gurumīśvaram,
Puṃsāmapūrṇakāmānāṃ kāmapūrāmarāṅghripam. 7.


O Lord Mahādeva, I bow down to you, the spiritual master and controller of the worlds. You are like the heavenly tree that fulfills the desires of those whose desires are unfulfilled.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


22 Sep 2021

No comments:

Post a Comment