శ్రీ మదగ్ని మహాపురాణము - 169 / Agni Maha Purana - 169
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 169 / Agni Maha Purana - 169 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 52
🌻. చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు అరువది నాలుగు యోగినులను గూర్చి చెప్పెదను. వీరి స్థానము క్రమముగ తూర్పు నుండి ఈశాన్య పర్యంతము ఉండును. యోగినుల పేర్లు : అక్షోభ్య, రూక్షకర్ణి, రాక్షసి, కృపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, క్షేమ, ఇల, నీలాలయ, లోల, అలక్త, బలాకేశి, లాలస, విమల, హుతాశ, విశాలాక్షీ, హుంకార, బడబాముఖి, మహాక్రూర, క్రోధన, భయంకరి, మహానన, సర్వజ్ఞ, తరల, తార, ఋగ్వేద, హయానన, సార, హుద్రసంగ్రాహి, శబర, తాలజింఘిక, రక్తాక్షి, సుప్రసిద్ద, విద్యుజ్జిహ్వ, కరఁకిణి, మేఘనాద, ప్రచండ, ఉగ్ర, కాలకర్ణి, వరప్రడ, చంద్ర చంద్రావలి, ప్రపంచ, ప్రలయాంతిక, శిశువక్త్ర, పిశాచి పిశితాశ, లోలుప, ధమని, తపని, రాగిణి, వికృతానన, వాయువేగ, బృహృత్కుక్షి, వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, జయంతిక, బిడాలి, రేవతి, పూతన, విజయాంతిక. ఈ యోగినులకు ఎనిమిది లేదా నాలుగు చేతులుండును.
ఇచ్ఛానుసారముగ ఆయుధములను ధరించు చుందురు, ఉపాసకులకు సంపూర్ణ సిద్ధులను ప్రసాదింతురు. భైరవునకు పండ్రెండు చేతులుండును. దంతములు ఎత్తుగా ఉండును. శిరస్సుపై జటా-చంద్రులుండును. ఒక వైపున నున్న ఐదు చేతులతో ఖడ్గ-అంకుశ-కుఠార-బాణ-జగదభయప్రదాన ముద్రలును రెండవ ప్రక్కనున్న ఐదుచేతులలో ధనుష్ - త్రిశూల-ఖట్వాంగ (మంచము కోడు) పాశకార్ధ - వరముద్రలను ధరించి యుండును. మిగిలిన రెండు చేతులలో గజ చర్మ యుండును. గజ చర్మమే వస్త్రము. సర్పాలంకారములచే అలంకృతుడై యుండును. మాతృకల మధ్య ప్రేతముపై కూర్చుండును. భైరవుని ప్రతిమ ఈ రూపమున నిర్మించి పూజించవలెను. భైరవునకు ఒక ముఖముండ వచ్చును. లేదా ఐదు ముఖములుండవచ్చును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 169 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 52
🌻Characteristics of images of different forms of goddesses - 1 🌻
The Lord said:
1. I shall describe (the characteristics) of the eight Yoginis (female attendants on Durgā) respectively residents of (the eight quarters) east to north-east. (The Yoginīs) Akṣobhyā, Rūkṣakarṇī, Rākṣasi, Kṛpaṇā and Akṣayā (reside in the east).
2. (The Yoginīs) Piṅgākṣī, Kṣayā, Kṣemā, Ilā, Līlā, Layā, Laktā, Balākeśī, Lālasā and Vimalā (dwell in the south-east).
3. (The Yoginīs) Hutāśā, Viśālākṣī, Huṅkārā, Vaḍavāmukhī, Mahākrūrā, Krodhanā, Bhayaṅkarī and Mahānanā (are the residents of the south).
4. (The Yoginīs) Sarvajñā, Taralā, Tārā, Ṛgvedā, Hayānanā, Sārā (Sārākhyā), Rudrasaṅgrāhī, Śambarā and Tālajaṅghikā (occupy the south (-west).
5. Raktākṣī, Suprasiddhā, Vidyujjihvā, Karaṅkiṇī, Meghanādā, Pracaṇḍogrā, Kālakarṇī and Varapradā (are the inmates of the west).
6. Candrā, Candrāvalī, Prapañcā, Pralayāntikā, Śiśuvaktrā, Piśācī, Piśitāśā and Lolupā (dwell in the north-west).
7. Dhamanī, Tāpanī, Rāgiṇī, Vikṛtānanā, Vāyuvegā, Bṛhatkukṣi, Vikṛtā and Viśvarūpikā (govern the north).
8. Yamajihvā, Jayanti, Durjayā, Jayantikā, Viḍālā, Revatī, Pūtanā and Vijayāntikā (hold sway over the north-east).
9. (These Yoginīs should be represented) as having eight arms (or) four arms, wielding weapons of their choice and yielding all benefits (on their votaries). (Lord) Bhairava may hold the arka plant (Calotropis gigantee) in the hand and have the face like the knee or elbow bearing the matted hair and the Moon.
10. Kṛttivāsas (should be represented) as holding on one side the sword, goad, axe and arrow and offering protection to the universe and a bow, trident, club with a skull at the top and noose on the other.
11. Or he shall be having five faces and be wearing the elephant’s hide and adorned by the serpents. He shall be seated on the dead body. He must be worshipped in the midst of the mother goddesses.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment