నిర్మల ధ్యానాలు - ఓషో - 294


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 294 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సాధారణంగా మనం సంక్షోభంలో వుంటాం. సంక్లిష్టంగా వుంటాం. వైరుధ్యాలతో వుంటాం. మనకి సమన్వయం కావాలి, స్పష్టత ఏర్పడాలి. అప్పుడే అస్తిత్వపు సత్యం అవగాహనకు వస్తుంది. అదెప్పుడూ లోపలనే వుంది.🍀


సత్యం కేవలం గాఢమయిన లోపలి సమశృతి గుండా మాత్రమే తెలుస్తుంది. సాధారణంగా మనం సంక్షోభంలో వుంటాం. సంక్లిష్టంగా వుంటాం. వైరుధ్యాలతో వుంటాం. మనలో ఒకరు 'యిది చెయ్యి' అంటారు. యింకొకరు 'ఇది చెయ్యకు' అంటారు. యిద్దరూ మనలోనే వున్నారు. మనసులోనే వున్నారు. మనం పగిలిన గాజు పాత్రలం. మనిషి పరిస్థితి అది. మనకి సమన్వయం కావాలి, స్పష్టత ఏర్పడాలి.

ఆ సమన్వయం ఏర్పడితే గొప్ప సంగీతం మొదలవుతుంది. అప్పుడే అస్తిత్వపు సత్యం అవగాహనకు వస్తుంది. అదెప్పుడూ లోపలనే వుంది. మనసు పెట్టే అల్లరిలో మనం గుర్తించం. ఈ లోపలి సంక్షోభం ఎప్పుడు చల్లబడుతుందో మనకు సన్నని సంగీతం వినపడుతుంది. అపుడు వ్యక్తి నిస్సందేహంగా 'ఇది నా స్వరం' నాలోంచీ ఆలపిస్తోంది' అని గ్రహిస్తాడు. అప్పుడు జీవితం ఆలయమవుతుంది. లేకుంటే మనం గాలిమేడలవుతాం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment