మైత్రేయ మహర్షి బోధనలు - 66
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 66 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 52. సంఘములు - సిద్ధాంతములు 🌻
మానవ సంఘమున అనేక సంఘములున్నవి. అనేక ఆధ్యాత్మిక సంఘములు కూడ నున్నవి. ఈ ఆధ్యాత్మిక సంఘముల ఆశయము లన్నియు ఒక్కటియే. వీరందరు కోరునది దివ్యజీవనమే. వీరవలంబించు మార్గములు మాత్రము వివిధములు. మార్గమున నడచు సభ్యులు దివ్యజీవనము కొరకు చేయు ప్రయత్నములో కొన్ని సిద్ధాంతములకు లోబడుదురు. సిద్ధాంతములచే బంధింప బడిన వారికి దివ్యభావన కన్న తమ సిద్ధాంతములను ప్రపంచమున కెక్కించుటకు ఉత్సాహమెక్కువగును. తత్కారణముగ రజోగుణ ప్రేరితులై ఇతర సిద్ధాంతములను నిరసించుచు మరింత బంధనము కలిగించు కొనుచుందురు. క్రమముగ దివ్యత్వము మరుగై సిద్ధాంతమే మిగులును.
ఇట్లు సిద్ధాంతములందు చిక్కుకొనువారు కోటానుకోట్లు కలరు. వీరందరి కిని వారి వారి సంఘములు ప్రాణతుల్యములు. ఇతర సంఘములు తుచ్ఛములు, అజ్ఞాన పూరితములు. తమ సిద్ధాంతమందు రాగమెంత యుండునో, ఇతర సిద్ధాంతముల యందు ద్వేషమంత యుండును. పై విధముగ రాగద్వేషములచే పీడింప బడుచు, తాము దైవజ్ఞులమని అహంకరించుచు, సంఘమున అలజడి కలిగించుచుందురు. నిజమగు దివ్యజీవనమున పరస్పరత్వము, సహాయ సహకారములు, ప్రశాంతత, సమర్థత గోచరించును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
31 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment