01 - FEBRUARY - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 01, మంగళవారం, ఫిబ్రవరి 2022 భౌమ వాసరే 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 22-4 - 315 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 513🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -143🌹  
5) 🌹 Osho Daily Meditations - 132🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 344-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 01, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ఆంజనేయ స్తోత్రం - 3 🍀*

*5. హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్ |*
*త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభమ్*

*6. నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్ |*
*పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*
*చొల్లంగి అమావాస్య, పుష్య అమావాస్య, మౌని అమావాస్య*
*Chollangi Amavas, Pushya Amavas, Mauni Amavas*

*🍀. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: అమావాశ్య 11:16:59 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: శ్రవణ 19:45:17 వరకు
తదుపరి ధనిష్ట
సూర్యోదయం: 06:47:58
సూర్యాస్తమయం: 18:11:19
వైదిక సూర్యోదయం: 06:51:42
వైదిక సూర్యాస్తమయం: 18:07:35
చంద్రోదయం: 06:55:22
చంద్రాస్తమయం: 18:24:29
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మకరం
యోగం: వ్యతీపాత 27:08:17 వరకు
తదుపరి వరియాన
కరణం: నాగ 11:18:02 వరకు
వర్జ్యం: 01:35:50 - 03:02:58 మరియు
23:26:20 - 24:54:52
దుర్ముహూర్తం: 09:04:39 - 09:50:12
రాహు కాలం: 15:20:29 - 16:45:54
గుళిక కాలం: 12:29:38 - 13:55:03
యమ గండం: 09:38:48 - 11:04:13
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 10:18:38 - 11:45:46
లంబ యోగం - చికాకులు, అపశకునం
19:45:17 వరకు తదుపరి ఉత్పాద యోగం
- కష్టములు, ద్రవ్య నాశనం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -315 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -4 📚*
 
*🍀 22-4. అభియుక్తుడు - అన్యచింతన క్రమముగ అదృశ్యమై, అనన్యమగు ఈశ్వరుని దర్శించుట సిద్ధింపవలెను. అప్పుడు సాధకుని ప్రజ్ఞ అంతట నిండియున్న ఈశ్వరునికి దగ్గరగ చేరి వసించుట యుండును. నామ రూపముల కతీతమైన ఈశ్వరుని, నామ రూపముతో పరిమితము చేసుకొనుట వలన సాధకుని బుద్ధి కూడ పరిమితమగును. అట్టి వారి యందు భేద భావమెక్కువ. సత్యదర్శనము మృగ్యము. 🍀*

*22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||*

*తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమములను నేను వహించుచున్నాను.*

*వివరణము : అన్యచింతన క్రమముగ అదృశ్యమై, అనన్యమగు ఈశ్వరుని దర్శించుట సిద్ధింపవలెను. పై విధముగ సమస్తమును ఈశ్వరునిగనే చింతించు వానికి ఈశ్వర ఉపాసనము జరుగును. అనగా వస్తువులతోను, జీవుల తోను సంబంధము కాక అన్నిటి యందున్న ఈశ్వరునితో సంబంధము పెరుగును. ఇట్లేశ్వర సంబంధము పెరుగగ, సాధకుని ప్రజ్ఞ అంతట నిండియున్న ఈశ్వరునికి దగ్గరగ చేరి వసించుట యుండును. దగ్గరగ వసించి యుండుట ఉప ఆసనము అని అందురు.*

*ఏదో ఒక రూపమునకు, నామమునకు పరిమితమైన సాధకుడు ఇతరమునంతను దైవముగ దర్శించడు. అతనికి దైవమనగా తాను పరిమితము చేసుకొన్న నామము, రూపమే. ఇతర మంతయు దైవ హీనమై యుండును. అట్టి మూర్ఖులే సృష్టి యందు అసంఖ్యాకములై యున్నారు. నామ రూపముల కతీతమైన ఈశ్వరుని, నామ రూపముతో పరిమితము చేసుకొనుట వలన సాధకుని బుద్ధి కూడ పరిమితమగును. అట్టి వారియందు భేద భావమెక్కువ. సత్యదర్శనము మృగ్యము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 513 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 43

*🌻. శివుని అద్భుత లీల - 5 🌻*

నారదుడిట్లు పలికెను -

ఓ సుందరీ! ఎవని కొరకై పార్వతి అడవిలో అతి తీవ్రమగు తపస్సును చేసినదో, ఆ శంకుడీతడే. నీవు ప్రత్యక్షముగా చూడుము (48).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీవు ఇట్లు పలుకగా ఆ మేన ఆనందముతో, అద్భుతమగు ఆకారము గలవాడు, అద్భుతులగు అనుచరులు గలవాడు, ఆశ్చర్యకరుడు అగు ఆ ప్రభుని దర్శించెను (49). అంతలో మహాద్భుతము, భూతప్రేతాదులతో కూడినది, అనేక గణములతో కూడు కున్నది అగు రుద్రసేన వచ్చెను (50). కొందరు తుఫాను వలె మహాశబ్దమును చేయుచుండిరి. మరికొందరు జెండాల రెపరెపల వంటి శబ్దమును చేయుచుండిరి. వారిలో కొందరు ఏనుగు తుండము కలిగి యుండిరి. మరి కొందరు ఏనుగు తుండము కలిగి యుండిరి. మరి కొందరు వికృతరూపమును దాల్చి యుండిరి (51). కొందరు భయంకరాకారులు, మరికొందరు కుంటివారు, మరికొందరు గ్రుడ్డివారు. కొందరు దండమును, పాశమును, మరికొందరు రోకలిని ధరించి యుండిరి (52).

కొందరి వాహనములు వెనుకకు నడుచుచున్నవి. కొందరు కొమ్ము బూరాలను ఊదుచుండిరి. కొందరు డమరుకములను, మరికొందరు గోముఖములను వాయించుచుండిరి (53). కొందరిచేతులు వికృతముగానుండెను. మరికొందరు గణములకు అనేకములగు చేతులు ఉండెను (54). కొందరికి కళ్లు లేవు. కొందరికి అనేకములగు కళ్లు ఉండెను. కొందరికి తలలు లేవు. మరికొందరి తలలు వికృతముగ నుండెను. కొందరికి చెవులు లేవు. మరికొందరికి చాల చెవులు గలవు. ఆ గణములు వివిధ వేషములను ధరించిరి (55). ఓ కుమారా! వికృతమగు ఇట్టి ఆకారములు గలవారు, బలశాలురు, మహావీరులు, భయమును గొల్పువారు అగు ఆ గణములు లెక్క లేనంత మంది ఉండిరి (56).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. ఉద్ధవుడు - మైత్రేయుడు 🌻*

*ఉద్ధవునితో పాటు మైత్రేయుడు కూడ బ్రహ్మజ్ఞాన నిర్ణయమును పరిపూర్తిగా పొందెను. అతడును మానవదేహస్థితి విడిచి , చిరంజీవియై శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించుచు, లోకమున ఉద్ధవుని వలెనే సంచరించుచు, పరమగురువులలో ఒకడైనాడు. అతడు నిరంతరము విష్ణుని పరావరునిగా , కరుణామయునిగా తలచు చుండును.*

*భగవంతుని ధ్యానించుట మాని కర్మబంధములను తొలగించు కొనుటకు కుస్తీ పట్టుట వలన మనస్సు దైవేతర విషయము నందు చిక్కుకొనును. కర్మ బంధము తొలగుట కూడ భగవంతుని అనుగ్రహ దృష్టియే యని తెలిసినవారికి అది తొలగిపోవును.*

........ ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 132 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 132. CHANGING CLIMATES 🍀*

*🕉 Seasons change. Sometimes it is winter, sometimes it is summer. If you are always in the same climate, you wil1feelstuck. 🕉*
 
*One has to learn to like that which is happening. That is what I call maturity. One has to like that which is already there. Immaturity is living always in "oughts" and "shoulds" and never living in the “is” –and “is” is the case. “Should” is just a dream. Whatsoever is the case is good. Love it, like it, and relax into it. When sometimes intensity comes, love it. When it goes, say goodbye. Things change ... life is in flux. Nothing remains the same, so sometimes there are great spaces and sometimes nowhere to move. But both are good. Both are gifts from existence.*

*One should be so grateful that whatever happens, one is grateful, thankful. Just enjoy it. This is what is happening right now. Tomorrow it may change; then enjoy that. The day after tomorrow something else may happen. Enjoy that. Don't compare the past with futile future fantasies. Live the moment. Sometimes it is hot, sometimes very cold, but both are needed; otherwise life will disappear. It exists in polarities.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 344 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 344-1. 'క్షయవృద్ధి వినిర్ముక్తా' 🌻* 

*క్షయము వృద్ధిల నుండి ముక్తి నిచ్చునది శ్రీదేవి అని అర్థము. క్షేత్రము లన్నియూ వృద్ధి పొందుచుండును. క్షయమగు చుండును. అష్ట ప్రకృతులకు వృద్ధి క్షయములు కలవు. ఇవి అన్నియూ క్షర పురుష భావము. మానవుని యందు గల అహంకారాదులగు అష్ట ప్రకృతులు కూడ కాలానుసారము వృద్ది క్షయము పొందు చుండును. కావున వీనితో సంగము మానవునికి కలిగిననాడు అతను కూడ క్షయ వృద్ధులను పొందినట్లు భావించును.*

*అష్ట ప్రకృతులు సృష్టి చక్రమున తిరుగుచుండును. వానికి స్థూలమైన మూల ప్రకృతి యందు చేరిననే కాని ఈ హెచ్చు తగ్గుల నుండి బైటపడుటకు వీలు పడదు. మూల ప్రకృతియైన శ్రీమాత సాన్నిధ్యముననే జీవులు అక్షయ అనుభూతి పొందగలరు. జీవులు అక్షరులే అయిననూ క్షరమగు ప్రకృతితో సంగమేర్పరచు కొనుట వలన సుఖ దుఃఖములను పొందుచున్నారు. తమ యందలి అష్ట ప్రకృతుల సంగమే సృష్టి యందలి అష్ట ప్రకృతులలో కూడ సంగ మేర్పరచు చున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 344 -1🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 344-1. Kṣaya-vṛddhi-vinirmuktā क्षय-वृद्धि-विनिर्मुक्ता (344) 🌻*

*She is beyond growth and decay. These are associated with all mortals. One has to look at the beauty of this nāma. In nāma 341 She was addressed as the gross body, Kṣetra-svarūpā. In 342 She was addressed as Kṣtreśī, wife of Kṣetrajña (Śiva). In the next nāma 343 She was called as the protector of both the Kṣetra and Kṣetrajña (body and soul) and in this nāma Vāc Devi-s address Her as the One without growth or decay, the qualities of the Brahman. Without calling Her as the Brahman She is being addressed by Her various actions.*

*Kṛṣṇa explains soul thus (Bhagavad Gīta II.23): “The soul is never born or dies; nor does it become only after being born, imperishable, eternal and free from birth and decay.....”*

*Bṛrhadāraṇyaka Upaniṣad (IV.iv.22) says “It is the controller of all…It does not grow better through good work nor worse through bad work”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment