🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 344 -1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀
🌻 344-1. 'క్షయవృద్ధి వినిర్ముక్తా' 🌻
క్షయము వృద్ధిల నుండి ముక్తి నిచ్చునది శ్రీదేవి అని అర్థము. క్షేత్రము లన్నియూ వృద్ధి పొందుచుండును. క్షయమగు చుండును. అష్ట ప్రకృతులకు వృద్ధి క్షయములు కలవు. ఇవి అన్నియూ క్షర పురుష భావము. మానవుని యందు గల అహంకారాదులగు అష్ట ప్రకృతులు కూడ కాలానుసారము వృద్ది క్షయము పొందు చుండును. కావున వీనితో సంగము మానవునికి కలిగిననాడు అతను కూడ క్షయ వృద్ధులను పొందినట్లు భావించును.
అష్ట ప్రకృతులు సృష్టి చక్రమున తిరుగుచుండును. వానికి స్థూలమైన మూల ప్రకృతి యందు చేరిననే కాని ఈ హెచ్చు తగ్గుల నుండి బైటపడుటకు వీలు పడదు. మూల ప్రకృతియైన శ్రీమాత సాన్నిధ్యముననే జీవులు అక్షయ అనుభూతి పొందగలరు. జీవులు అక్షరులే అయిననూ క్షరమగు ప్రకృతితో సంగమేర్పరచు కొనుట వలన సుఖ దుఃఖములను పొందుచున్నారు. తమ యందలి అష్ట ప్రకృతుల సంగమే సృష్టి యందలి అష్ట ప్రకృతులలో కూడ సంగ మేర్పరచు చున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 344 -1🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻
🌻 344-1. Kṣaya-vṛddhi-vinirmuktā क्षय-वृद्धि-विनिर्मुक्ता (344) 🌻
She is beyond growth and decay. These are associated with all mortals. One has to look at the beauty of this nāma. In nāma 341 She was addressed as the gross body, Kṣetra-svarūpā. In 342 She was addressed as Kṣtreśī, wife of Kṣetrajña (Śiva). In the next nāma 343 She was called as the protector of both the Kṣetra and Kṣetrajña (body and soul) and in this nāma Vāc Devi-s address Her as the One without growth or decay, the qualities of the Brahman. Without calling Her as the Brahman She is being addressed by Her various actions.
Kṛṣṇa explains soul thus (Bhagavad Gīta II.23): “The soul is never born or dies; nor does it become only after being born, imperishable, eternal and free from birth and decay.....”
Bṛrhadāraṇyaka Upaniṣad (IV.iv.22) says “It is the controller of all…It does not grow better through good work nor worse through bad work”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2022
No comments:
Post a Comment