నిర్మల ధ్యానాలు - ఓషో - 129-2


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-2 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి తనలో అసాధారణ శక్తిని కలిగి వున్నాడు. అది అనుభవానికి సంబంధించిన సమశృతి. దానికి అవసరయినదల్లా దాన్ని నువ్వు వినగలిగే శక్తి. అది గాఢమయిన నిశ్శబ్దం. అది నీ హృదయ స్పందన లాంటిది. అది లోతుల్లో కొంత రహస్యంగా వుంది. 🍀


మనిషి తనలో అనంతమయిన సంగీతాన్ని వినిపించగలిగే అసాధారణ శక్తిని కలిగి వున్నాడు. నేను 'మనిషి' అంటే ప్రతి మనిషీ అని అర్థం. నేను 'సంగీతం' అంటే మామూలు సంగీతమని కాదు. సాధారణార్థంలో ప్రతిమనిషీ సంగీతకారుడు కాడు. ఆ నైపుణ్యం కొందరికే వుంటుంది. అది పుట్టుకతో వస్తుంది. నేను చెప్పే అర్థం పూర్తిగా వేరయింది. ఆందరికి అనుభవానికి సంబంధించిన సమశృతి. అది అన్ని సంగీతాల కన్నా అపురూపమైంది. అది 'సృష్టింపబడని' సంగీతం. దానికి ఎట్లాంటి సంగీతవాద్యాలు అక్కర్లేదు. ఎట్లాంటి శిక్షణా అవసరం లేదు.

అక్కడ అవసరయినదల్లా దాన్ని నువ్వు వినగలిగే శక్తి. అది గాఢమయిన నిశ్శబ్దం. అది అప్పటికే అక్కడ వుంది. అది నీ జీవితం. జెన్'కు సంబంధించి దాన్ని 'ఒంటి చేతి చప్పుడు' అంటారు. సాధారణ సంగీతానికి రెండు విషయాలు అవసరం. అప్పుడు అక్కడ శబ్దం సృష్టింపబడుతుంది. గిటార్ వాయించాలంటే తీగలపై వేళ్ళుండాలి. నీ వేళ్ళతో తీగల్ని మీటితే సంగీతం వస్తుంది. కానీ లోపలి సంగీతానికి సంబంధించి అక్కడ చెయ్యాల్సింది అలాంటిది కాదు. అక్కడ అప్పటికే ఆ సంగీతం వుంది. అది నీ హృదయ స్పందన లాంటిది. మరికొంత లోతుల్లో మరికొంత రహస్యంగా అది వుంది. అది నీ నిజమైన హృదయ స్పందన.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2022

No comments:

Post a Comment